న్యూజిలాండ్, భారత్ మధ్య జరుగుతున్న రెండో టెస్టులో భాగంగా రెండోరోజు ఆట ప్రారంభించిన కివీస్ భారత బౌలర్స్ దెబ్బకు తట్టుకోలేకపోయింది. ఇండియన్ బౌలర్స్ దెబ్బకు కివీస్ 235 పరుగులకే ఆల్లౌట్ అయ్యింది. మొదటిరోజు విషయానికి వస్తే ఇండియా 242 పరుగులకు ఆల్లౌట్ అయ్యింది. ఇక అసలు విషయానికి వస్తే ఈ మ్యాచ్ లో భారత ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా అద్భుతం సృష్టించాడు. కివీస్ బౌలర్ వాగ్నర్ బ్యాట్టింగ్ ఆడుతున్న సమయంలో అతడు కొట్టిన బంతిని అద్భుతంగా జంప్ చేసి క్యాచ్ పెట్టాడు. మామోలుగా జడేజా ప్రపంచంలోనే బెస్ట్ ఫీల్డర్ అని అందరికి తెలిసిందే.
