Home / ANDHRAPRADESH / ఏపీలో తెల్లవారుజాము నుంచే పింఛన్ల పంపిణీ ప్రారంభం..!

ఏపీలో తెల్లవారుజాము నుంచే పింఛన్ల పంపిణీ ప్రారంభం..!

ఏపీలో జగన్ సర్కార్ ఫిబ్రవరి నుంచి సామాజిక పింఛన్లను లబ్దిదారుల ఇంటి దగ్గరకే పంపిణీ చేసే కార్యక్రమాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఈ నెల కూడా పింఛన్లను లబ్దిదారులకు వారి ఇంటి దగ్గరే అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 58.99లక్షల పింఛన్‌ లబ్ధిదారులకు ఈ తెల్లవారుజామునుంచే పింఛన్ల పంపిణీ ప్రారంభమైంది. అదివారం సెలవు రోజు అయినప్పటికీ పింఛన్‌దారులకు వారి ఇంటి వద్దే డబ్బులు అందజేసేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. వలంటీర్లు లబ్ధిదారుల ఇంటి వద్దకు చేరుకుని పింఛన్లు పంచుతున్నారు. ఉదయం 7 గంటల కంతా 11శాతంపైగా మందికి పింఛన్‌ పంపిణీ పూర్తిచేసినట్లు పంచాయితీరాజ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలక్రిష్ణ ద్వివేది ట్విటర్‌ ద్వారా పేర్కొన్నారు. ఈ మధ్యాహ్నంకంతా వందశాతం పింఛన్ల పంపిణీ పూర్తిచేయనున్నట్లు తెలిపారు.

కాగా, వలంటీర్ల ద్వారా లబ్ధిదారుల ఇళ్ల వద్దే పింఛన్లు పంపిణీ చేసే కార్యక్రమాన్ని ప్రభుత్వం ఫిబ్రవరి నెల నుంచి ప్రారంభించిన విషయం తెలిసిందే. పింఛన్లు పంపిణీ చేసేందుకు వలంటీరు తమ పరిధిలో ఉండే ఫించనుదారులందరినీ ఒక చోటుకు పిలిపించడం చేయరాదని స్పష్టంగా ఆదేశాలు జారీ అయ్యాయి. బయోమెట్రిక్‌ విధానం ద్వారా లబ్ధిదారుల వేలి ముద్రలు తీసుకున్న తర్వాత నగదు పంపిణీ చేస్తున్నారు. ఈ ప్రక్రియతో సంబంధం లేని ప్రైవేట్‌ వ్యక్తులను లబ్ధిదారుల ఇళ్ల వద్దకు తీసుకెళ్లొద్దని వలంటీర్లకు సూచనలు జారీఅయ్యాయి. లబ్ధిదారుల ఇంటి వద్దకే పింఛన్‌ పంపిణీ కార్యక్రమం శరవేగంగా సాగుతోంది. ఉదయం 6 గంటలనుంచే గడపగడపకు పింఛన్‌ పంపిణీ మొదలైంది. వలంటీర్లు లబ్ధిదారుల ఇంటి వద్దకు చేరుకుని పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. ఉదయం 8 గంటలకు 26,20,673 మందికి.. 9 గంటలకు 31లక్షల మందికి పింఛన్‌ పంపిణీ పూర్తయింది. ఈ మధ్యాహ్నంకంతా దాదాపు 60 లక్షల మందికి రూ. 1,384 కోట్ల పింఛన్‌ పంపిణీ కానుంది. మొత్తంగా తమ ఇంటి దగ్గరకే నెలనెలా పెన్షన్లు అందుతుండడంతో అవ్వాతాతలు, దివ్యాంగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నెలనెలా పింఛన్ కోసం ఆఫీసుల దగ్గర ఎండలో పడిగాపులు కాసే అవస్థ తప్పిందని లబ్దిదారులు సంతోషపడుతున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat