టీడీపీ అధినేత చంద్రబాబుకు విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో ఉత్తరాంధ్ర ప్రజల చేతిలో ఎదురైన ఘోర పరాభావంతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ వెనకడుగు వేసినట్లు తెలుస్తోంది. చంద్రబాబు అమరావతికి జై కొట్టి విశాఖలో రాజధాని ఏర్పాటుపై కుట్రలు చేస్తుండడంతో సహించలేని ఉత్తరాంధ్ర ప్రజలు చంద్రబాబును ఎయిర్‌పోర్ట్ వద్ద అడ్డుకుని, ఆయన కాన్వాయ్‌పై చెప్పులు, టమాటాలు, గుడ్లు విసిరారు. చంద్రబాబు ఐదుగంటల పాటు నడిరోడ్డుపై కూర్చుని..పోలీసులపై చిందులు వేసినా…ప్రజలు ఎక్కడా వెనకడుగు వేయలేదు..బాబును పట్టపగలే చుక్కలు చూపించారు. దీంతో చేసేదేమి లేక చంద్రబాబు అవమానభారంతో తిరిగి వెళ్లిపోవాల్సి వచ్చింది. అయితే తన స్నేహితుడు చంద్రబాబుకు విశాఖలో జరిగిన పరాభవం దృష్ట్యా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా ఉత్తరాంధ్రలో అడుగుపెట్టడానికి ధైర్యం చేయడం లేదు.
తాజాగా మార్చి 2 నుంచి 4 వరకు ఉత్తరాంధ్ర జిల్లాల సమావేశం నిమిత్తం పవన్ కల్యాణ్ మూడు రోజుల పాటు విశాఖ, విజయనగరం జిల్లాలలో పర్యటించాల్సి ఉంది.. ఈ మేరకు పవన్ టూర్ షెడ్యూల్ కూడా రెడీ చేశారు. అయితే చంద్రబాబుకు ఉత్తరాంధ్ర ప్రజల చేతిలో జరిగిన శాస్త్రి నేపథ్యంలో తనను కూడా అడ్డుకుంటారనే భయంతో పవన్ ఉత్తరాంధ్ర జిల్లాలలో పర్యటించేందుకు వెనకడుగు వేసినట్లు తెలుస్తోంది. అందుకే నాదెండ్ల మనోహర్ గారి ఆధ్వర్యంలో మార్చి 2 నుంచి 4 వరకు పార్టీ ఉత్తరాంధ్ర సమావేశాలు విశాఖ, విజయనగరం జిల్లాలో జరుగుతాయంటూ పవన్ కల్యాణ్ రాజకీయ కార్యదర్శి హరి ప్రసాద్ మీడియాకు ప్రెస్‌నోట్ విడుదల చేశారు. కాగా చంద్రబాబులాగే పవన్ కూడా అమరావతికి జై కొట్టాడు. స్వయంగా రాజధాని గ్రామాల్లో పర్యటించి..అమరావతి ఆందోళనలకు మద్దతు పలికాడు…అమరావతి నుంచి రాజధానిని తరలిస్తూ ఊరుకోమంటూ జగన్ సర్కారుకు హెచ్చరికలు కూడా చేశాడు. దీంతో పవన్ కల్యాణ్‌పై కూడా ఉత్తరాంధ్ర ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.
అలాగే చంద్రబాబులాగే పవన్ కూడా పులివెందుల నుంచి వచ్చిన వ్యక్తులు ఉత్తరాంధ్రలో వేల ఎకరాలను లాగేసుకుంటున్నారు..ఇలాగే జరుగుతూ పోతే రేపు మనం భూములు లేక బానిసలుగా ఉండాల్సి వస్తుంది. వాళ్లకు ఊడిగం చేయాల్సి వస్తుందంటూ ఉత్తరాంధ్ర ప్రజలను రెచ్చగొట్టాడు. పవన్ వ్యాఖ్యలపై వైసీపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నాయి. ఇప్పటికే చంద్రబాబును అడ్డుకున్న ఘటన నేపథ్యంలో ఉత్తరాంధ్ర ప్రజల్లో భావోద్వేగాలు బలంగా ఉన్న టైమ్‌లో విశాఖలో అడుగుపెడితే.. తనకు కూడా చంద్రబాబుకు పట్టిన గతి పట్టడం ఖాయమని భావించిన పవన్ …ఉత్తరాంధ్ర జిల్లాల పర్యటనను రద్దు చేసుకుని తన స్థానంలో నాదెండ్ల మనోహర్‌ను పంపిస్తున్నాడు. మొత్తంగా చంద్రబాబుపై చెప్పులు, టమాటాలు పడినట్లు తనపై కూడా పడతాయని భయపడిన పవన్ కల్యాణ్ ఉత్తరాంధ్రకు రాకుండా సినిమా షూటింగ్‌ల పేరుతో సర్దుకున్నట్లు తెలుస్తోంది.. ప్రస్తుతం జనసేనాని ఉత్తరాంధ్ర జిల్లాల పర్యటన రద్దుపై ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.