అధికారం కోల్పోతే ఒక మనిషి ఆవేదన ఇంత దారుణంగా ఉంటుందా అనేది చంద్రబాబుని చూస్తే బాగా అర్ధమవుతుంది అనడంలో సందేహమే లేదు. ఎందుకంటే 40ఏళ్ల రాజకీయ అనుభవం అని చెప్పుకునే చంద్రబాబు మూడుసార్లు ముఖ్యమంత్రిగా చేసిన ప్రజలకు చేసింది ఏమైనా ఉందా అంటే శూన్యమే కనిపిస్తుంది. ముఖ్యంగా గత పాలనలో చూసుకుంటే చంద్రబాబు అండ్ కో అధికార అహంకారంతో ప్రజలపై రౌడీలుగా ప్రవతిన్చారని చెప్పాలి. ఇప్పుడు తాజాగా జగన్ ని ఏమీ చెయ్యలేక తండ్రికొడుకు ఇద్దరూ కొత్త పథకాలు వేస్తున్నారు. దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందించిన విజయసాయి రెడ్డి “వైద్య శాస్త్రాల్లో ఎక్కడా ప్రస్తావన లేని ఫోబియా తండ్రీ, కొడుకులకు పట్టుకుంది. ‘పులివెందుల ఫోబియా’ ఒకటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) తక్షణం నోటిఫై చేయాలి. లేకపోతే ఎక్కడ ఇద్దరు వాదులాడుకున్నా అందులో ఒకరు పులివెందుల నుంచి వచ్చాడని వణికి చచ్చేట్టున్నారు!” అని అన్నారు.
