శనివారం నాడు న్యూజిలాండ్ వేదికగా రెండో టెస్ట్ ప్రారంభం అయ్యింది. మూడు టెస్టుల్లో భాగంగా మొదటి మ్యాచ్ కివీస్ గెలుచుకుంది. ఇక ముందుగా టాస్ గెలిచి కివీస్ బౌలింగ్ ఎంచుకుంది. దాంతో బ్యాట్టింగ్ కు వచ్చిన భారత ఓపెనర్స్ లో ప్రిథ్వి షా అర్ధ శతకం సాధించిగా మరో ఓపెనర్ చేతులెత్తేసాడు. అగర్వాల్ తరహాలోనే కెప్టెన్ కోహ్లి, రహానే కూడా వెంటవెంటనే ఔట్ అయ్యారు. ఆ తరువాత వచ్చిన విహారి హాఫ్ సెంచరీ చేసాడు. ఇక మిగతా అందరూ కివీస్ ధాటికి కోలుకోలేకపోయారు. దాంతో మొదటిరోజే టీమిండియా 242 పరుగులకే ఆల్లౌట్ అయ్యింది. న్యూజిలాండ్ బౌలర్ జమిసన్ 5వికెట్లు తీసాడు.
