తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. మార్చి 6వ తేదీ నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మార్చి 6వతేదీన ఉదయం 11 గంటలకు గవర్నర్ ప్రసంగంతో సమావేశాలు ప్రారంభమవుతాయి. ఉభయసభల సభ్యులను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై తొలిసారి ప్రసంగించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం శనివారం నోటిఫికేషన్ విడుదల చేసింది.
