గుంటూరు జిల్లా తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ తో ప్రముఖ వ్యాపార దిగ్గజం, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ఖేశ్ అంబానీ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని వివిధ ప్రాజెక్టుల ఏర్పాటుపై చర్చించారు. ముఖేశ్ అంబానీ వెంట ఆయన కుమారుడు అనంత్, ఎంపీ పరిమళ్ నత్వానీ ఉన్నారు. కాగా, రాష్ట్రంలోని వివిధ ప్రాజెక్టుల ఏర్పాటుపై చర్చిస్తున్నట్టు సమాచారం. అంబానీకి గన్నవరం ఎయిర్ పోర్టులో పార్టీ ఎంపీ వేణుంబాక విజయసాయి రెడ్డి స్వాగతం పలికారు. రాష్ట్రంలో రిలయన్స్ వ్యాపారాలను విస్తరించేందుకు, మరిన్ని పెట్టుబడులు పెట్టనున్నట్టు తెలుస్తోంది.
