గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కి తృటిలో ప్రమాదం తప్పింది. శుక్రవారం నాడు ఆయన ఓ వివాహానికి సంబంధించి తాడేపల్లి మండలం ఉండవల్లి వెళ్ళడం జరిగింది. ఈ సందర్భంగా వధూవరులను ఆశీర్వదించడానికి స్టేజ్ ఎక్కిన ఆర్కేకు అక్కడే పెను ప్రమాదం తప్పింది. ఆయన ఎక్కగానే ఉన్నటుంది అది విరిగిపోయింది. దాంతో ఆయన కాలికి గాయం కావడంతో గుంటూరులోని ఆశుపత్రికి తీసుకెళ్ళారు. ట్రీట్మెంట్ అనంతరం ఇంటికి వెళ్ళిపోయారు. ప్రజలు ఆందోళన చందడంతో తనకేం కాలేదని ఆర్కే చెప్పారు. మరోపక్క నాయకులు దగ్గర నుండి ఫోన్ కాల్స్ వస్తున్నాయి.