మున్సిపాలిటీలో ఉన్న అన్ని వార్డులు అభివృద్ది చేసుకోవడం మన బాద్యత అని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు.మున్సిపాలిటీలో పలు కాలనిలలో పట్టణ ప్రగతి సందర్బంగా ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి,కలెక్టర్ హరిత గార్లు సందర్శించారు..కాలనీలలో తిరుగుతూ డ్రైనేజి,రోడ్లు,ఇతర సమస్యలను పరిశీలించారు..ప్రజల వద్ద నుండి వినతులను స్వీకరించారు.
ముందుగా వార్డులు అభివృద్ది చెందితేనే పట్టణాలు అభివృద్ది చెందుతాయని సీఎం కేసీఆర్,మంత్రి కేటీఆర్ పట్టణ ప్రగతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు..కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పట్టణ ప్రగతి కార్యక్రమంలో ప్రజలను బాగస్వామ్యం చేయాలన్నారు. ప్రతీ ఒక్కరూ బాద్యతగా పట్టణ ప్రగతి కార్యక్రమంలో పాల్గొని మన వార్డులను మనమే అభివృద్ది చేసుకోవాలన్నారు.
పట్టణ ప్రగతిలో అదికారులు అలసత్వం వహించకుండా ఉండాలన్నారు.కాలనీల్లో ఇబ్బందిగా కరెంట్ పోల్స్,ఇండ్లపై ఉన్న కరెంట్ తీగలు,పారిశుద్య నిర్వహణ శుభ్రంగా ఉంచాలన్నారు..మన పట్టణాన్ని అభివృద్ది చేసుకునేందుకు మంచి అవకాశం అన్నారు.18వార్డులో వారి వార్డు అభివృద్ధికి కృషి చేస్తున్న 6 యువకులకు ఎమ్మెల్యే ప్రోత్సాహక బహుమతిగా ఒక్కో యువకునికి రూ.2వేలుగా రూ.12వేలు అందచేశారు.