2014లో అధికారం చేపట్టిన చంద్రబాబు ప్రభుత్వం ఆరు నెలల్లోనే అమరావతిని రాజధానిగా ప్రతిపాదించారు. అయితే అప్పటికే చంద్రబాబు అండ్ కో ఇల్లు మొత్తం చక్కపెట్టేసారు. భూములు మొత్తం తక్కువ ధరలకే కొనేసారు. గత ప్రభుత్వంలో ఐదేళ్ళ కాలంలో అమరావతి తప్పా మిగతా ఏమీ కనిపించలేదు. ఎందుకంటే అమరావతి రాజధాని కావడంతో ధరలు ఆకాశాన్ని అంటడంతో వారు ఇంకా మితిమీరిపోయారు. ఇప్పుడు కూడా వాటిని కాపాడుకోవడానికే ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నారు తప్ప జనం కోసం కాదు. బయటకు మాత్రం ప్రజల కోసమే ఈ తాపత్రయం అంతా అన్నట్టు కవర్ చేస్తున్నారు. దీనిపై ట్విట్టర్ వేదికగా చంద్రబాబుని వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి ప్రశ్నించారు. “ఉత్తరాంధ్ర ప్రజలంటే అంత చులకన భావమెందుకు చంద్రబాబూ? ఒక వైపు అమరావతి నుంచి రాజధాని తరలించ వద్దని ఉత్తుత్తి ఉద్యమాలు నడిపిస్తావు. మళ్లీ ఉత్తరాంధ్ర వెళ్లి అక్కడి ప్రజలను రెచ్చగొట్టాలని చూస్తావు. వారి ఆత్మగౌరవంతో ఆటలాడుకుంటే ఇలాంటి శాస్తే జరుగుతుంది”అని అన్నారు.