అమరావతి ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై సీఐడీ, ఈడీ అధికారులతో పాటు..సిట్ టీమ్ కూడా రంగంలోకి దిగి…టీడీపీ పెద్దల బినామీల గుట్టును బయటపెడుతున్నారు…మరో పక్క ఏసీబీ అవినీతిపై ఆరోపణల నేపథ్యంలో వివిధ ప్రభుత్వ శాఖలపై ఏకకాలంలో దాడులు నిర్వహిస్తున్నారు. తాజాగా మాజీ మంత్రి దేవినేని ఉమా మాజీ మంత్రి దేవినేని ఉమా బంధువు గద్దె వీరభద్రరావుపై వచ్చిన అవినీతి ఆరోపణల నేపథ్యంలో కంచికచర్ల మండలం పెరకలపాడు సహకార సంఘం భవనంలో శనివారం ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. పొట్లూరి అరుణ అనే మహిళ ఫిర్యాదు మేరకు రికార్డులను తనిఖీలు చేస్తున్నారు. తన పేరు మీద గద్దె వీరభద్రరావు లోన్ తీసుకున్నారని సదరు మహిళ ఆరోపిస్తున్నారు. సహకార పరపతి సంఘంలో తాను లోను తీసుకోకపోయినప్పటికీ తీసుకున్నట్లుగా తన పేరును ఉపయోగించి బినామీ రుణాలు పొందారని అరుణ ఫిర్యాదు చేశారు. పూర్వపు పాలకవర్గం, ప్రస్తుత కార్యదర్శులు తన పేరును ఉపయోగించే బినామీ రుణాలు పొందారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రస్తుతం పెరకలపాడు సహకారం సంఘంలో ఏసీబీ తనిఖీలు కొనసాగుతున్నాయి. సదరు గద్దె వీరభద్రరావు దేవినేని ఉమా బినామీ అని తెలుస్తోంది. అమరావతిలో కూడా దేవినేని ఉమాకు బినామిగా భూములు ఏమైనా కొనుగోలు చేశారా అన్న కోణంలో కూడా ఏసీబీ అధికారులు విచారణ జరుపుతున్నారు. మొత్తంగా దేవినేని ఉమా బంధువుపై ఏసీబీ దాడులు నిర్వహించడంతో కంచికచర్ల టీడీపీ నేతల్లో, ముఖ్యంగా దేవినేని ఉమా బినామీల్లో కలవరం మొదలైంది.