మెగాస్టార్ చిరంజీవి ఇంటిదగ్గర హై టెన్షన్ నేలకొనింది. దాంతో ఆయన నివాశం వద్ద భారీగా పోలీస్ బందోబస్త్ ఏర్పాటు చేసారు. బ్యారికేట్లు అడ్డుపెట్టి కాపలా కాస్తున్నారు. ఇదంతా ఎందుకు ఏం జరిగింది అనే విషయానికి వస్తే..ప్రస్తుతం ఏపీ లోని అమరావతి తరలింపు విషయంలో రచ్చ జరుగుతున్న విషయం అందరికి తెలిసిందే. ఈ మేరకు నిరసనలు కూడా జరుగుతున్నాయి. అయితే ఈ నిరసనలకు సంబంధించి చిరంజీవి వారికి మద్దతు ఇవ్వడంలేదంటూ..అమరావతి పరిరక్షణ సమితి జేఏసి ఈరోజు చిరు ఇంటిని ముట్టడి చెయ్యలని పిలుపునిచ్చారు. ఈ నేపధ్యంలో చిరంజీవి ఇంటికి భారీ ఎత్తున మెగాస్టార్ అభిమానులు తరలి వచ్చారు. అయితే ఈ ముట్టడి విషయంలో తనకి ఎలాంటి సంబంధం లేదని జేఏసి చెబుతున్నారు.
