తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ పార్టీలోకి కాంగ్రెస్,టీడీపీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు,మాజీ ఎంపీలు,ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు చేరిన సంగతి విదితమే. అయితే తాజాగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఒకరు గులాబీ తీర్థం పుచ్చుకోనున్నారు అని వార్తలు ఆ జిల్లా రాజకీయాల్లో ప్రచారంలో ఉన్నాయి.
కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు,మాజీ మంత్రి,టీపీసీసీ ఉపాధ్యక్షుడు,మంథని నియోజకవర్గ ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పనున్నారు అని జిల్లా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఎమ్మెల్యే శ్రీధర్ బాబు చేరికకు ముఖ్యమంత్రి,గులాబీ దళపతి కేసీఆర్ నుండి గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చినట్లు సమాచారం.
అందులో భాగంగా మార్చి ఏడో తారీఖున రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని ముఖ్యమంత్రి అధికారక నివాసం ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గులాబీ కండువా కప్పుకోనున్నారు అని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తల్లో ఎంతమేరకు నిజం ఉందో మార్చి ఏడో తారీఖు వరకు ఆగాల్సిందే.