Home / ANDHRAPRADESH / మరోసారి విశాఖకు చంద్రబాబు..పక్కా స్కెచ్.. ఈ సారి భారీ విధ్వంసానికి టీడీపీ కుట్ర చేస్తుందా..!

మరోసారి విశాఖకు చంద్రబాబు..పక్కా స్కెచ్.. ఈ సారి భారీ విధ్వంసానికి టీడీపీ కుట్ర చేస్తుందా..!

విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో చంద్రబాబు కాన్వాయ్‌పై చెప్పులు, టమాటాలు, గుడ్లు కొట్టి అడ్డుకోవడంపై టీడీపీ రగలిపోతుంది..వైసీపీ శ్రేణులే చంద్రబాబు కాన్వాయ్‌ను అడ్డుకున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తుంటే..విశాఖలో రాజధాని ఏర్పాటును అడ్డుకుంటున్న చంద్రబాబుపై ప్రజలు తిరగబడ్డారని వైసీపీ నేతలు అంటున్నారు. ఇదిలా ఉంటే…ఎక్కడ అడ్డుకున్నారో…అక్కడ నుంచే మళ్లీ చంద్రబాబు ప్రజా చైతన్యయాత్ర మొదలుపెట్టాలని టీడీపీ నేతలు పట్టుదలతో ఉన్నారు. ఈ మేరకు మళ్లీ విశాఖలో చంద్రబాబు పర్యటనకు టీడీపీ ఏర్పాట్లు చేస్తుంది. అయితే ఈ సారి విశాఖలో బాబు టూర్‌కు పకడ్బందీగా స్కెచ్ వేశారు. ఈ సారి ఫ్లైట్‌లో కాకుండా ట్రెయిన్ లేదా..రోడ్డు మార్గం ద్వారా విశాఖకు రావాలని చంద్రబాబు భావిస్తున్నాడు. రోడ్డు మార్గంలో వస్తే ఊరూరా టీడీపీ శ్రేణులు చంద్రబాబుతో పాటు విశాఖకు తరలివచ్చే అవకాశం ఉంటుంది..అప్పుడు బాబు యాత్రను అడ్డుకోవడం వైసీపీ శ్రేణులకు సాధ్యం కాదని..టీడీపీ అదిరిపోయే స్కెచ్ వేసింది..ఈసారి బాబు టూర్ బాధ్యతలను యనమలకు అప్పగించారు.

 

అయితే ఎయిర్‌పోర్ట్‌లో ఉత్తరాంధ్ర ప్రజల చేతలో అంత ఘోర అవమానం పొందినా చంద్రబాబు నిస్సిగ్గుగా మళ్లీ విశాఖలో పర్యటించాలని నిర్ణయించడం బాధ్యతారాహిత్యమే..ఇక రోడ్డు మార్గం ద్వారా రావాలనుకోవడం పూర్తిగా కుట్రపూరితమే…రోడ్డు మార్గం ద్వారా వస్తే ఇప్పటికే వైజాగ్‌లో రాజధానిని వ్యతిరేకిస్తున్న చంద్రబాబుపై ఊరూరా ప్రజలు తిరగబడే అవకాశం ఉంది. ఎయిర్‌పోర్ట్ ఘటనలో పులివెందుల రౌడీలంటూ టీడీపీ నేతలు చేసిన విమర్శలపై వైసీపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. దీంతో ప్రజలతో పాటు వైసీపీ శ్రేణులు కూడా అడుగడుగునా..బాబును అడ్డుకునేందుకు ప్రయత్నించవచ్చు. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున అల్లర్లు జరిగే అవకాశం ఉండచ్చు..ఈ గలాటాలో సంఘ విద్రోహ శక్తులు చేరి..భారీ విధ్వంసానికి పాల్పడే ప్రమాదం ఉంది..

 

చంద్రబాబుకు కావాల్సిందే…ఎయిర్‌పోర్ట్ ఘటన నేపథ్యంలో మరోసారి విశాఖలో అడుగుపెడితే.. కచ్చితంగా ప్రజలతో పాటు వైసీపీ కార్యకర్తలు అడ్డుకుంటారని బాబుకు తెలుసు.. ఏదో వి‎ధంగా రెచ్చగొట్టి అల్లర్లు ప్రారంభిస్తే ఆ తర్వాత కావల్సిన విధ్వంసం జరుగుతుందని తెలుసు..అయినా ఇంత ఉద్రికత్త పరిస్థితుల నేపథ్యంలో మరోసారి విశాఖలో కాలుపెడుతున్నాడంటే…చంద్రబాబుకు తన రాజకీయ స్వప్రయోజనాలే తప్పా…ఉత్తరాంధ్ర ప్రజల కన్నీళ్లు ముఖ్యం కాదని అర్థమవుతుంది. ప్రశాంతంగా ఉన్న విశాఖలో భారీ విధ్వంసం జరిగేలా చేసి, జాతీయ స్థాయిలో ప్రభుత్వాన్ని బద్నాం చేస్తే..కేంద్రం మూడు రాజధానుల ఏర్పాటుపై వెనక్కి తగ్గుతుందని టీడీపీ భావిస్తోంది. మొత్తంగా ఉత్తరాంధ్రలో అమరావతి నినాదాన్ని తీసుకుపోవాలన్న చంద్రబాబు కుటిల రాజకీయం విజయవంతం అవుతుందా..లేదా…మళ్లీ ఎయిర్‌పోర్ట్‌లో జరిగిన సీన్ రిపీట్ అవుతుందా అన్నది చూడాలి.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat