ఎన్నికల్లో ఘోర ఓటమి తరువాత చంద్రబాబు మారతాడని, ప్రజలకు చేతోడు వాతోడుగా ఉంటాడని అందరు అనుకున్నారు. కానీ ఏమాత్రం మారలేదు కదా కనీసం కనికరం కూడా లేదు. అధికారంలో ఉన్నప్పుడు తన సొంత ప్రయోజనాలకోసం ఎలాగైతే చూసుకున్నాడో ఇప్పుడు కూడా అదేవిధంగా ఆ కుర్చీ కోసం పాకులాడుతున్నాడు. దీనికోసమని జనాల్ని ఇబ్బందులకు గురిచేస్తున్నాడు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు అప్పటికి ప్రతిపక్ష నేత జగన్ ప్రజల కష్టాలను తెలుసుకొని వాటిపై పోరాటం చేసాడు. కాని చంద్రబాబు ఎలా ప్రవతించాడు అనేదానిపై విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందించాడు. “ప్రజలు ఉమ్మేస్తారన్న సిగ్గు కూడా లేకుండా ప్రవర్తిస్తున్నావు చంద్రబాబూ. నిర్లక్ష్యానికి గురైన ఉత్తరాంధ్రను పరిపాలనా రాజధాని చేయాలని సిఎం జగన్ గారు నిర్ణయిస్తే దాన్ని వ్యతిరేకిస్తూ బస్సు యాత్రకు బయలుదేరతావా? అమరావతి కోసం ఉత్తరాంధ్ర ప్రజల నోటి దగ్గర ముద్దను లాక్కుంటావా?” అని ప్రశ్నించారు.
