విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో చంద్రబాబు కాన్వాయ్‌ను అడ్డుకోవడంపై టీడీపీ నేతలు, ఎల్లోమీడియా రెచ్చిపోతుంది. పులివెందుల రౌడీలు వచ్చి చంద్రబాబు కాన్వాయ్‌పై దాడి చేశారని టీడీపీ నేతలు ఆరోపించారు. ఎల్లోమీడియా అయితే చంద్రబాబు కాన్వాయ్‌ను అడ్డుకోవడం ఏదో సంఘవిద్రోహ చర్య అన్నట్లుగా చిత్రీకరిస్తోంది. కాగా టీడీపీ, ఎల్లోమీడియా విమర్శలకు వైసీపీ నేతలు ధీటుగా బదులిస్తున్నారు. రాజధాని గ్రామాల్లో వైసీపీ నేతల కాన్వాయ్‌లను అడ్డుకుని భౌతిక దాడులకు తెగబడింది అమరావతి ఉద్యమకారులైతే…విశాఖలో చంద్రబాబు కాన్వాయ్‌ను అడ్డుకున్నది కూడా ఉద్యమకారులే అని వైసీపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. తాజాగా విశాఖ ఎయిర్‌పోర్ట్ ఘటనపై టీడీపీ చేస్తున్న రాజకీయంపై వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఫైర్ అయ్యారు. ప్రజలను రెచ్చగొట్టి రాష్ట్రంలో గందరగోళం సృష్టించాలని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కుట్రలు పన్నుతున్నారని అంబటి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
కేవలం అమరావతిలో తన బినామీ ఆస్తులను కాపాడుకోవడం కోసమే చంద్రబాబు ఆరాటపడుతున్నారని విమర్శించారు. వికేంద్రీకరణకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్న ఉత్తరాంధ్ర ద్రోహి చంద్రబాబు నేడు ప్రజాగ్రహాన్ని చవిచూశారని అంబటి అన్నారు. విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో జరిగిన ఘటన ఉత్తరాంధ్ర అభివృద్ధికి.. బాబు కుళ్లుబుద్ధికి మధ్య పోరాటంగా అంబటి అభివర్ణించారు. వైజాగ్ వెళ్లి అమరావతి జిందాబాద్ అంటూ రెచ్చ గొడుతున్నారు..ఉత్తరాంధ్రలో రాజధాని వద్దని చెపితే చంద్రబాబును మేళా తాళాలతో స్వాగతిస్తారా..? ఉత్తరాంధ్ర నాశనం చేస్తానంటే అక్కడ ప్రజలు ఒప్పుకుంటారా..? అందుకే చంద్రబాబును ఉత్తరాంధ్ర ప్రజలు వెనక్కి పంపేశారని అంబటి అన్నారు.
ఏదో అమరావతి రాజుగారు ఉత్తరాంధ్ర మీద దండయాత్రకు వెళ్లి నట్లు చంద్రబాబు వెళ్లారని అందుకే ప్రజలు తిరగబడ్డారని అంబటి ఎద్దేవా చేశారు. గతంలో హోదా కోసం కొవ్వొత్తుల ర్యాలికి వెళ్తే ఎయిర్ పోర్ట్ నుంచి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని బయటకు రానివ్వలేదు..వైఎస్ జగన్‌కు స్వాగతం పలికేందుకు ప్రజలు వస్తే రన్‌వే మీద అడ్డుకున్న విషయాన్ని మర్చిపోవద్దు అని చంద్రబాబుకు చురకలు అంటించారు. ఇక పులివెందుల రౌడీలు అంటూ టీడీపీ నేతలు చేస్తున్న ప్రచారంపై అంబటి మండిపడ్డారు. రాష్ట్రంలో ఏం జరిగినా పులివెందుల నుంచి వచ్చారని టీడీపీ నేతలు అసత్యాలు ప్రచారం చేస్తూ సీమ ప్రజలను అవమానిస్తున్నారని అంబటి ఆగ్రహం వ్యక్తం చేశారు..గతంలో కాపుల ఉద్యమ సమయంలో కూడా పులివెందుల నుంచి రౌడీలు వచ్చారని అసత్య ప్రచారం చేశారని అంబటి ఫైర్ అయ్యారు. మొత్తంగా విశాఖలో చంద్రబాబు కాన్వాయ్ అడ్డుకున్న ఘటన..ఉత్తరాంధ్ర అభివృద్ధికి.. బాబు కుళ్లుబుద్ధికి మధ్య జరిగిన పోరాటం అని అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయవర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారాయి,.