రాజకీయాల్లో నేను 40 ఇయర్స్ ఇండస్ట్రీ, 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పని చేశా…15 ఏళ్లు ప్రతిపక్ష నాయకుడిని, దేశంలోనే నా అంత సీనియర్ నాయకుడు లేడు అని విర్రవీగే చంద్రబాబుకు విశాఖ ప్రజలు పట్టపగలే చుక్కలు చూపించారు. ప్రజాగ్రహం ముందు ఎంతటి నాయకుడైనా తలవంచక తప్పదని చంద్రబాబుకు అర్థమైంది. వికేంద్రీకరణకు వ్యతిరేకంగా అమరావతి ఆందోళనలు నడిపిస్తున్న చంద్రబాబు..మరో పక్క విశాఖలో రాజధాని ఏర్పాటుపై విషం కక్కుతున్నాడు. దశాబ్దాలుగా అభివృద్ధికి నోచుకోక వలసల బాట పడుతున్న ఉత్తరాంధ్ర ప్రజలు రాజధాని ఏర్పాటు అయితే తమ ప్రాంతం డెవలప్ అవుతుందని తమ బతుకులు బాగుపడతాయని ఆశించారు. అయితే చంద్రబాబు గత రెండున్నరేళ్లుగా విశాఖలో రాజధాని ఏర్పాటుపై ఎల్లోమీడియాతో కలిసి చేస్తున్న కుట్రలను సహించలేకపోయారు. ఇక జై అమరావతి అంటూ జోలెపట్టి కొన్ని జిల్లాలలో తిరిగిన చంద్రబాబు కనీసం ఉత్తరాంధ్రలో అడుగుపెట్టే ధైర్యం చేయలేకపోయాడు. చివరకు ప్రభుత్వం పేదలకు ఇండ్ల స్థలాలకు కోసం చేస్తున్న ల్యాండ్ పూలింగ్‌లో ఓ 9 మంది రైతులకు అన్యాయం జరిగిందంటూ వారి పరామార్శ పేరుతో విశాఖలో అడుగుపెట్టబోయాడు.
వాస్తవంగా చూసుకుంటే..ఉత్తరాంధ్ర ప్రజలకు, తెలంగాణ ప్రజలకు కాస్త సామీప్యం ఉంటుంది..తెలంగాణలో లాగే ఉత్తరాంధ్ర ప్రజల్లో అమాయకత్వం ఉంటుంది…దశాబ్దాలుగా అన్ని రంగాల్లో వివక్షకు గురవుతునే ఉన్నారు. దీంతో ఇక్కడి ప్రజల్లో ఉద్యమ చైతన్యం, తిరుగుబాటు తత్వం కాస్త ఎక్కువే. అందుకే తన సామాజికవర్గ ప్రయోజనాల కోసం తమ ప్రాంతానికి మరోసారి అన్యాయం చేయాలని చూస్తున్న చంద్రబాబుపై ఉత్తరాంధ్ర ప్రజలు తిరుగుబాటు చేశారు. ఉత్తరాంధ్ర ద్రోహి చంద్రబాబు గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. విశాఖ ఎయిర్‌పోర్ట్‌కు చంద్రబాబు రాగానే ఆయన కాన్వాయ్‌ను అడ్డుకుని తమ నిరసన తెలియజేశారు. 5 గంటల పాటు చంద్రబాబు కాన్వాయ్‌ను ఎయిర్‌పోర్ట్ నుంచి బయటకు అడుగుపెట్టనివ్వలేదు.. జై విశాఖ అనకుండా చంద్రబాబును కదలనిచ్చేది లేదని భీష్మించుకుని కూర్చున్నారు. ప్రజల ఆగ్రహం ముందు పోలీసులు కూడా ఏం చేయలేకపోయారు. చంద్రబాబు, అచ్చెంనాయుడు వంటి నేతలను ముందుకు కదలనివ్వలేదు. దీంతో చంద్రబాబు రోడ్డుపై బైఠాయించి రాజకీయం చేశాడు. అయినా విశాఖ ప్రజలు వెనకడుగువేయలేదు..చంద్రబాబుకు పట్టపగలే చుక్కలు చూపించారు. దీంతో బాబు అండ్ కో తోక ముడిచి అవమానభారంతో తలవంచుకుని అక్కడ నుంచి హైదరాబాద్‌కు వెళ్లిపోయారు.
కేవలం తన కుల ప్రయోజనాల కోసం పాకులాడే నాయకుడిని…ఆత్మగౌరవం, స్వాభిమానం కల ఉత్తరాంధ్ర ప్రజలు విజయవంతంగా అడ్డుకున్నారు. కాగా పులివెందుల గూండాలంటూ టీడీపీ నేతలు ఆరోపించడం నిజంగా హాస్యాస్పదం..చంద్రబాబును అడ్డుకున్న వారిలో మహిళలు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు..వారిని కూడా పులివెందుల గూండాలు అందామా..టీడీపీ నేతల విజ్ఞతకే వదిలేద్దాం.. ఇది కేవలం తన కులం కోసం పని చేసే చంద్రబాబులాంటి నాయకుడికి మర్చిపోలేని గుణపాఠం…ఇది తమ ప్రాంతం కోసం ప్రాణమిచ్చే ఉత్తరాంధ్రప్రజల విజయం.. 40 ఇయర్స్ ఇండస్ట్రీ అయినా..ప్రజాగ్రహం ముందు తోకముడవక తప్పదని చంద్రబాబుకు అర్థమయ్యేలా చేసిన ఉత్తరాంధ్ర ప్రజలకు హ్యాట్సాఫ్..నిజంగా చంద్రబాబుపై ఉత్తరాంధ్ర ప్రజల తిరుగుబాటు నవ్యాంధ్రప్రదేశ్ చరిత్రలో నిలిచిపోనుంది.