తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ నుండి వరంగల్ మధ్య ఉన్న జాతీయ రహాదారి త్వరలోనే పచ్చని అందాలతో కనువిందు చేయనున్నది. హెచ్ఎండీఏ అర్భన్ ఫారెస్ట్ విభాగం అధికారులు వరంగల్ జాతీయ రహాదారి మధ్యలో ఉన్న ఔటర్ రింగ్ రోడ్డు ఘట్కెసర్ నుండి యాదాద్రి వరకు నిన్న గురువారం సుమారు ముప్పై కిలోమీటర్ల మేర నేషనల్ హైవే -163వెంట సెంట్రల్ మీడియన్ (2.3మీటర్లు)లో గ్రీనరీ పనులను మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్భన్ డెవలప్మెంట్ పీఎస్ అర్వింద్ కుమార్ పర్యవేక్షణలో ప్రారంభమయ్యాయి.
యాదాద్రి టెంపుల్ ఆలయ అభివృద్ధిలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు హెచ్ఎండీఏ ఈ పనులను మొత్తం రూ. ఐదు కోట్ల యాబై ఐదు లక్షలతో రానున్న రెండు నెలల్లో పూర్తి చేయాలని సంకల్పించింది.
కి. మీకి రూ.18.50లక్షల అంచనా వ్యయంతో ఈ పనులు అధికారులు చేపట్టారు. హైదరాబాద్ నుండి యాదాద్రికి పెద్ద సంఖ్యలో భక్తులు రాకపోకలు సాగిస్తున్న నేపథ్యంలో ప్రయాణం ఆహ్లాదంగా సాగేలా సెంట్రల్ మీడియన్ లో మొత్తం 3.72లక్షల మొక్కలను నాటేందుకు అధికారులు రెడీ అయ్యారు.