తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రదాత ముఖ్యమంత్రి కేసీఆర్ అని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు.శుక్రవారం నడికూడ మండల కేంద్రంలో మరియు రామకృష్ణాపురం గ్రామంలో రూ.51లక్షల 30వేలతో నూతన సిమెంట్ రోడ్ల పనులకు శంఖుస్థాపన చేశారు.
అనంతరం ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రాభివృధ్ధికో సీఎం కేసీఆర్ ప్రత్యేక విజన్ తో ముందుకు వెళ్తున్నారని అన్నారు.ప్రజల కష్టాలు తెలిసిన వ్యక్తి సీఎంగా ఉండడం మన అదృష్టం అన్నారు.కొట్లాడి తేచ్చుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని అనతి కాలంలోనే అగ్రగామిగా నిలబెట్టిన ఘనత కేసీఆర్ గారిదన్నారు.
గ్రామాలు అభివృద్ధి చెందుతేనె రాష్ట్రాభివృద్ధి సాధ్యమని పల్లెప్రగతి కార్యక్రమం సీఎం కేసిఆర్ చేపట్టారన్నారు.పల్లెప్రగతి ద్వారా గ్రామాల రూపురేఖలు మారాయన్నారు.దేశంలో ఎక్కడాలేని అభివృద్ధి,సంక్షేమ పథకాలు మన రాష్ట్రంలో జరుగుతున్నాయన్నారు.బంగారు తెలంగాణ నిర్మాణమే కేసీఆర్ గారి ధ్యేయమని అన్నారు.పల్లెప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో కలిసి ప్రజల భాగస్వామ్యంతో విజయవంతం చేసి మన పట్టణాలను,గ్రామాలను అభివృద్ధిలో ముందుంచి ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలని అన్నారు.