తెలంగాణ రాష్ట్రం విద్యుత్ వినియోగంలో సరికొత్త రికార్డును సొంతం చేసుకుంది. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ వినియోగం రోజురోజుకు కొత్త రికార్డులను నమోదు చేస్తోంది.
ఈ రోజు ఉదయం ఏడు గంటల యాబై రెండు నిమిషాలకు రికార్డు స్థాయిలో మొత్తం 13,168 మెగావాట్ల డిమాండ్ నమోదైంది. ఇది అప్పటి ఉమ్మడి ఏపీ 2014లో వినియోగించిన 13,162మెగా వాట్ల కంటే ఎక్కువ కావడం గమనార్హం.
సాగువిస్తీర్ణం పెరగడం, వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ,కాళేశ్వరంతో పాటు ఇతర ఎత్తిపోతల పథకాల వలన కరెంటు డిమాండ్ నానాటికి పెరుగుతుంది.