భారత్, న్యూజిలలాండ్ మధ్య జరగబోతున్న రెండో టెస్ట్ లో భాగంగా భారత్ కు ఎదురుదెబ్బ తగిలింది. కుడి చీలమండ గాయం కారణంగా ఇషాంత్ శర్మ క్రైస్ట్‌చర్చ్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టెస్టుకు దూరమయ్యాడు. ఉమేష్ యాదవ్ అతని స్థానంలో రావొచ్చని తెలుస్తుంది. మొదటి మ్యాచ్ లో కివీస్ చేతులో ఘోరంగా ఓడిపోయిన భారత్ ఈసారైనా మ్యాచ్ గెలిచి పరువు నిలుపుతుందో లేదో చూడాలి. అయితే మొదటి మ్యాచ్ లో అందరూ విఫలమైనా ఇషాంత్ ఒక్కడే బౌలింగ్ లో మెరుగైన ప్రదర్శన చేసాడు. కాని ఈసారి మాత్రం గాయం తో మ్యాచ్ కు దూరమవ్వడం నిజంగా జట్టుకి మైనస్ అని చెప్పాలి.
