ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న మహిళాల టీ20 ప్రపంచకప్ లో భారత్ దూసుకుపోతుంది. వరుసగా ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, న్యూజిలాండ్ జట్లపై గెలిచి హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసి సెమీస్ కు వెళ్ళిన మొదటి జట్టుగా నిలిచింది. భారత్ ఇంత మంచి విజయాలు సాధించడం వెనుక ఓపెనర్ షెఫాలీ వర్మ కృషి ఉంది. తన అద్భుతమైన బ్యాట్టింగ్ ఆడిన మూడు మ్యాచ్ లలో వరుసగా మొదటి రెండు మ్యాచ్ లలో ప్లేయర్ అఫ్ ది మ్యాచ్ అవార్డ్స్ తీసుకుంది. అయితే అంతకుముందు 2018 లో జరిగిన టీ20 ప్రపంచకప్ లో కూడా భారత్ సీనియర్ మరియు లెజెండరీ ప్లేయర్ మిథాలీ రాజ్ కూడా అద్భుతమైన బ్యాట్టింగ్ తో వరుసగా రెండు ప్లేయర్ అఫ్ ది మ్యాచ్ అవార్డ్స్ సాధించింది. తద్వారా సీనియర్ ప్లేయర్ రికార్డును సమానం చేసింది.