స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం అల వైకుంఠపురంలో. ఈ చిత్రానికి గాను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించారు. సంక్రాంతి టైమ్ లో వచ్చిన ఈ చిత్రం బ్లాక్ బ్లాస్టర్ హిట్ గా నిలిచింది. కలెక్షన్లు పరంగా కూడా రికార్డు సృష్టించి. ఇక ఓవర్సీస్ విషయానికి వస్తే ఎంత పెద్ద సినిమా అయినా సరే నెలరోజుల తరువాత ఓటీటీ ప్లాట్‌ఫాంలో ప్రసారం అవ్వాల్సిందే. దాంతో అక్కడ ఉన్న భారతీయులకు ఇది ఈజీ అని చెప్పొచు. అయితే అసలు మేటర్ కి వస్తే ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ఓటీటీ ప్లాట్‌ఫాం విషయంలో సోషల్ మీడియాలో పుకార్లు వస్తున్నాయి. అయితే దీనికి సంబంధించిన సాటిలలైట్ మరియు డిజిటల్ రైట్స్ మొత్తం సన్ నెక్స్ట్ ఇవ్వడం జరిగింది. కాని మొన్నటి నుండి ఈ చిత్రం నెట్ ఫ్లిక్ష్ లో కూడా ప్రసారం అవుతుంది. దాంతో ప్రొడక్షన్ డిపార్టుమెంటును అడిగితే ఓవర్సీస్ లో ఎక్కడైతే సన్ నెక్స్ట్ ప్రభావం తక్కువగా ఉందో అక్కడ నెట్ ఫ్లిక్ష్ లో ప్రసారం అయ్యేలా అగ్రిమెంట్ రాసుకున్నామని అది రెవిన్యూ కోసమని క్లారిటీ ఇవ్వడం జరిగింది.