వైసీపీ సీనియర్ నేత రాజ్యసభ సభ్యుడు ఎంపీ విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా మరోసారి చంద్రబాబుపై విరుచుపడ్డాడు. చంద్రబాబు ప్రభుత్వంలో అధికారాన్ని అరచేయుల్లో పెట్టుకొని కనీసం ప్రజలవైపు చూడలేదు. తమ సొంత ప్రయోజనాలకే అన్ని ఉపయోగగించుకున్నారు తప్ప ఎవరికీ ఏమీ చేసింది లేదనే చెప్పాలి. మరోపక్క బడికి వెళ్ళే పిల్లల విషయంలో కూడా చంద్రబాబు కనికరం చూపించలేదని జగన్ గోరుముద్ద, అమ్మ ఒడి కింద ఏటా 15 వేలు, కాలేజి విద్యార్థులకు 20 వేల వసతి దీవెన, ఇంగ్లిష్ మీడియంలో బోధన. విద్యార్థుల భవిష్యత్తు కోసం రూపొందించిన ఇన్ని పథకాలు ఏ రాష్ట్రంలో కనిపించవు. పిల్లల నోరుకొట్టి మీరు తాగే హిమాలయ వాటర్ కు మాత్రం కోట్లు పోశావు కదా బాబూ అని అన్నారు.
