కరోనా వైరస్ దెబ్బకు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలో ఈ వైరస్ సోకకుండా నియంత్రించడానికి ముందు జాగ్రత్త చర్యలు అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. తమ దేశ ప్రజలను భహిరంగ సభల్లో పాల్గొనకుండా ఆర్డర్ పాస్ చేసారు. ఈ ఎఫెక్ట్ తో ఈ నెల 27న మిలన్ లో ఒక వింతైన ఫుట్‌బాల్ మ్యాచ్ చోటుచేసుకుంది. అయితే ఇక అసలు విషయానికి వస్తే ఇటలీ లో 600 పైగా COVID-19 కేసులు నమోదు అవ్వగా వీరు హోమ్ టౌన్, ఇంటర్నేజియోనేల్ మరియు బల్గేరియా యొక్క లుడోగోరెట్స్ మధ్య ఫుట్‌బాల్ మ్యాచ్‌ను నిర్వహించింది. వారి భయాలను పక్కనపెట్టి, బల్గేరియన్లు మరియు స్వదేశీ జట్టు ఖాళీ స్టేడియంలో అద్భుతమైన మ్యాచ్ ఆడారు. ఇది విన్న అందరూ అబద్ధం అనుకుంటారు. కాని ఇది నిజంగా జరిగింది. ఈ వైరస్ ప్రభావంతో ఎక్కడికక్కడ ఎక్కువ మంది జనసంచారం ఉండకూడదని నిబంధనలు పెట్టారు. దాంతో మ్యాచ్ చూడడానికి వచ్చిన వారికి స్టేడియం వారు టికెట్స్ కూడా ఇవ్వలేదు దాంతో మ్యాచ్ ప్రేక్షకులు లేకుండానే జరిగింది.