ఫ్లోరెన్స్ నైటింగేల్ 200 వ జయంతిని పురస్కరించుకుని ప్రపంచ ఆరోగ్య సంస్థ 2020 నర్సుల సంవత్సరంగా ప్రకటించినా సందర్భంగా శనివారం కొవ్వొత్తి ర్యాలీని మహబూబ్ నగర్ పట్టణంలో లో నిర్వహించనున్నాము అని నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్ రూడవత్ తెలిపారు.తేదీ 29-02-2020 శనివారం సాయంత్రం 5 గంటలకు మహబూబ్ నగర్ ప్రభుత్వ వైద్యశాల వద్ద గౌరవ మంత్రి వర్యులు శ్రీనివాస్ గౌడ్ గారు జెండా ఊపి కొవ్వొత్తి ర్యాలీని ప్రారంభిస్తారు. ప్రభుత్వ వైద్యశాల నుండి జిల్లా పరిషత్ గ్రౌండ్ వరకు కొవ్వొత్తి ర్యాలీని నిర్వహిస్తారు.
ఈ కార్యక్రమంలో గౌరవ మాజీ ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు ప్రస్తుత జడ్చర్ల ఎమ్యెల్యే సి లక్ష్మ రెడ్డి గారు పాల్గొంటారు అలాగే టి ఆర్ స్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీ వాల్యా నాయక్ గారు తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ గజిటెడ్ అధికారులు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ జూపల్లి రాజేందర్ గారు మరియు నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీను రాథోడ్ ముఖ్య సలహాదారులు డాక్టర్ చెరుకూరి రామ్ తిలక్ ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్ రూడవత్, వైస్ ప్రెసిడెంట్ కవిత గారు కోశాధికారి వంశీ ప్రసాద్. ఎస్వీఎస్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ప్రిన్సిపాల్ డాక్టర్ లీనా గారు, నవోదయ కాలేజ్ ప్రిన్సిపాల్ ,అరుంధతి గారు, జాగృతి స్కూల్ ఆఫ్ నర్సింగ్ ప్రిన్సిపాల్ ఫెబ్బెమ్మ , ప్రభుత్వ వైద్యశాల నర్సింగ్ ఉద్యోగులు, సునాయ పర్వీన గారు మేనేజ్మెంట్ శ్రీ హర్ష న్యూరో సైక్యాట్రిక్ అండ్ స్పెషలిటీ హాస్పిటల్ మరియు అధిక సంఖ్యలో నర్సింగ్ విద్యార్థులు పాల్గొన్నానున్నారు.