ఏపీ,తెలంగాణ రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్లు పెరగనున్నయా.?. ఇప్పటికే అధికార పార్టీల్లోకి ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు,నేతలు చేరుతుండటంతో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో సీట్ల పంపకంలో ఎదురుకానున్న సమస్యలకు పరిష్కారం దొరకనున్నదా..?. అయితే ఈ వార్తలపై కేంద్ర హోం శాఖ సహయక మంత్రి కిషన్ రెడ్డి క్లారిటీచ్చారు.
ఆయన మాట్లాడుతూ”ఏపీ,తెలంగాణ రాష్ట్రాల్లో ప్రత్యేకించి అసెంబ్లీ సీట్ల పెంపు ఉండదు. సీట్ల పెంపు అనేది దేశమంతా జరుగుతుంది. ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాలు పెంపు ప్రత్యేకంగా ఉండదని ఆయన తేల్చి చెప్పారు.
అసెంబ్లీ స్థానాల పెంపును ఏపీ విభజన చట్టంలో రాత్రికి రాత్రి చేర్చారు. ఆ తర్వాత జరగనున్న పర్యావసనాల గురించి అప్పటి కేంద్ర ప్రభుత్వం ఆలోచించలేదని ఆయన హెద్దేవా చేశారు.