ఏపీ వికేంద్రీకరణకు వ్యతిరేకంగా అమరావతి గ్రామాల రైతులు రెండున్నర నెలలుగా ఆందోళనలు చేస్తున్న సంగతి విదితమే. అయితే ఈ ఆందోళనలు టీడీపీ అధినేత చంద్రబాబు సామాజిక వర్గం నడిపిస్తున్న కృత్రిమ ఉద్యమమని విమర్శలు వెల్లువెత్తున్నాయి. ముఖ్యంగా రాజధాని గ్రామాల్లో నిరసన కార్యక్రమాలు చేస్తున్న వారిలో 80 శాతం చంద్రబాబు సామాజికవర్గానికి చెందినవారు కావడమే గమనార్హం. ఇప్పటికే అమరావతి అందరి రాజధాని కాదు..కుల రాజధానిగా ముద్రపడింది. అందుకే రాజధాని రైతులు ఎంత పోరాటం చేస్తున్నా…రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో పెద్దగా మద్దతు రావడం లేదు. దీంతో అమరావతి ఆందోళనలు రాజధాని పరిధిలోని 29 గ్రామాల్లో అదీ ముఖ్యంగా బాబు సామాజికవర్గం ఎక్కువగా ఉన్న ఐదారు గ్రామాలకే పరిమితమైంది.
కాగా రాజధాని రైతుల వ్యవహార శైలి కూడా వారి పట్ల తీవ్ర వ్యతిరేకతను తీసుకువచ్చింది. ఎంతసేపూ అమరావతిలోనే రాజధాని కొనసాగాలని మొండిపట్టు పడుతున్నారే తప్పా..రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల ప్రజల ప్రయోజనాల కోసం రాజధాని రైతులు ఆలోచించడం లేదు. కర్నూలులో రాజధాని వస్తే ఏమొస్తుంది..నాలుగు టీ కొట్లు..రెండు జీరాక్స్ సెంటర్లు తప్పా అంటూ…సీమ ప్రజల మనోభావాలను అమరావతి రైతులు కించపర్చారు. ఇక దశాబ్దాలుగా వెనుకబడిన ఉత్తరాంధ్ర ప్రజల గోస కూడా వారికి పట్టడం లేదు..ఎంతసేపు రాజధాని రైతులకు తమ కులపెద్ద చంద్రబాబు రాజకీయ ప్రయోజనాలు, తమ వ్యాపార ప్రయోజనాలే ముఖ్యమయ్యాయి. అందుకే రాజధానిలో ప్రభుత్వం 55 వేల మంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు కేవలం 1251 ఎకరాలు కేటాయించినా..మూర్థంగా అడ్డుపడుతున్నారు.
తాజాగా అమరావతిలో నిరుపేదలకు ప్రభుత్వం ఇళ్ల స్థలాలను కేటాయించడాన్ని వ్యతిరేకిస్తూ రాజధాని రైతులు హైకోర్టుకెక్కారు. రాజధాని ప్రాంతంలో తమకు తప్పా..ఇతర మండలాలకు చెందిన వారికి భూములివ్వడం సరికాదని..సీఆర్‌డీఏ చట్టాన్ని ఉల్లంఘించడమే అని అమరావతి రైతులు వాదిస్తున్నారు. అలాగే మేము భూములిచ్చింది రాజధాని కోసమని…పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి కాదని అడ్డగోలుగా వాదిస్తున్నారు. చంద్రబాబు లాగే రాజధాని రైతులకు కూడా పేదలంటే ఎందుకో అంత చులకన భావం…ఎందుకో అంత ఏహ్యభావం..ఇతర మండలాల వారికి భూములు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తున్న రాజధాని రైతులు మరి దేశ, విదేశీ పారిశ్రామిక వేత్తలకు మాత్రం భూములు ఇచ్చేందుకు ఎందుకు ముందుకు వచ్చారు. దీన్ని బట్టి వారికి సాటి మనుషుల కంటే…తమ ఆర్థిక ప్రయోజనాలే ముఖ్యమని అర్థమవుతుంది.
ముఖ్యంగా చంద్రబాబు సామాజికవర్గంలో 80 శాతం ధనికవర్గంగా చెలామణీ అవుతుంది. కేవలం 20 శాతం మాత్రం ఆర్థికంగా వెనుకబడి ఉంటారు. అందుకే బాబు సామాజికవర్గం రాజకీయంగా, ఆర్థికంగా ఇతర కులాలపై ఆధిపత్యం చూపుతోంది. వారికి దళిత, బడుగు, బలహీనవర్గాలంటే చిన్నచూపు…చంద్రబాబు కూడా ఎవరైనా దళితుల్లో పుట్టారని అనుకుంటారా అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశాడు. బాబు సామాజికవర్గం వారిది కూడా దాదాపుగా ఇదే మైండ్ సెట్..అందుకే వ్యాపార వేత్తలకు భూములు ఇస్తాం..కానీ పేదలకు కాస్తంత గజం చోటు ఇస్తామంటే ఒప్పుకోమంటూ కోర్టులకు వెళుతున్నారు. అయినా ప్రభుత్వం 33 వేల ఎకరాల్లో కేవలం 1251 ఎకరాలు మాత్రమే పేదలకు ఇస్తా అంటోంది అయినా రాజధాని రైతులు వ్యతిరేకిస్తున్నారంటే వీళ్లను ఏమనుకోవాలి. అసలు రాజధానిలో ధనికవర్గాలే ఉండాలా…పేదలు ఉండకూడదా..అన్న ప్రశ్నలకు రాజధాని రైతులు సమాధానం చెప్పాలి. అసలు రాజధాని రైతులను చూస్తుంటే..వీళ్లు నిజంగా రైతులా..రియల్ ఎస్టేట్ వ్యాపారులా అన్న సందేహం వస్తుంది..మూడు రాజధానుల వద్దు..అమరావతి ముద్దు అనడం కంటే మాకు పారిశ్రామికవేత్తలు ముద్దు…పేదల వద్దు అంటే సరిపోతుంది. నిజంగా పేదలంటే వీరికి ఎందుకంత ఏహ్యభావం..అందుకే వీరి పోరాటానికి రాష్ట్రంలోని మిగిలిన సామాజికవర్గాలు, ప్రజల నుంచి మద్దతు రావడం లేదని అర్థమవుతుంది.