ఆస్ట్రేలియా వేదికగా మహిళల టీ20 ప్రపంచకప్ జరుగుతున్న విషయం అందరికి తెలిసిందే. ఇందులో భాగంగా టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య మొదటి మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో అద్భుత ప్రదర్శనతో ఇండియా ఘనవిజయం సాధించింది. ఆ తరువాత జరిగిన రెండో మ్యాచ్ లో బంగ్లాదేశ్ పై గెలిచింది. దాంతో హ్యాట్రిక్ పై కన్నేసిన ఇండియా గురువారం నాడు న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లో గెలిచి హ్యాట్రిక్ విజయాలు నమోదు చెయ్యడమే కాకుండా 2020 లో జరుగుతున్న ఈ టీ20 ప్రపంచకప్ లో సెమీస్ కు చేరుకున్న మొదటి జట్టుగా నిలిచింది. మరి ఈ గ్రూప్ లో సెమీస్ లో అడుగుపెట్టే మరో జట్టు ఏదీ అనేది ఇంకా తెలియాల్సి ఉంది.
