రాజకీయాల్లో అధికారం ఉంది కదా అని అహంకారంతో విర్రవీగడం ఎంత తప్పో..తాము చేసిన పాపం..చివరకు రివర్సై తమకే తగులుతుందని టీడీపీ అధినేత చంద్రబాబుకు ఇప్పుడు తెలిసివచ్చింది. గత టీడీపీ సర్కార్ నాటి ప్రతిపక్ష నాయకుడు అయిన జగన్‌ను పలు సందర్భాల్లో వేధించింది. . ముఖ్యంగా 2017లో విశాఖలో ప్రత్యేక హోదా ఉద్యమానికి మద్దతుగా ఏపీ యువత చేపట్టిన ర్యాలీ కార్యక్రమానికి హాజరు కావడానికి ప్రతిపక్ష నాయకుడు జగన్ విశాఖకు విమానంలో వచ్చారు. అయితే అప్పుడు చంద్రబాబు సర్కార్ ఎయిర్‌పోర్ట్ నుంచి ఆయన్ని బయటకు రాకుండా…పోలీసులతో అడ్డుకుంది. విశాఖలో అడుగుపెట్టనివ్వకుండా.. జగన్‌ను హైదరాబాద్‌కు తిరిగి వెళ్లిపోవాలని పోలీసులు వత్తిడి చేశారు. ఈ క్రమంలో జగన్‌తోపాటు, విజయసాయిరెడ్డి వంటి నేతలపై పోలీసులు దురుసుగా వ్యవహరించారు. దీంతో ప్రభుత్వ తీరుకు నిరసనగా జగన్ రన్‌వే పై కూర్చుని నిరసన తెలిపారు. ఆ తర్వాత ఎంతకీ పోలీసులు విశాఖ నగరంలోకి అనుమతి ఇవ్వకపోవడంతో తిరిగి హైదరాబాద్‌కు వెళ్లిపోయారు. ఒకానొక సందర్భంలో చంద్రబాబు తీరుపై జగన్ మండిపడ్డారు. వాళ్ల టైమ్ వచ్చింది.. కొట్టారు..తీసుకున్నాం..మా టైమ్ వస్తుంది..గట్టిగా కొడతాం అని జగన్ చంద్రబాబుకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.
ఇప్పుడు ఆ టైమ్ రానే వచ్చింది. అదే విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో సేమ్ సీన్ రిపీటైంది. ఇప్పుడు సీఎం జగన్ అయితే..ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు..అదొక్కటే తేడా…అప్పుడు జగన్‌ను అడ్డుకున్నది పోలీసులు అయితే..ఇప్పుడు అడ్డుకున్నది ప్రజలు కావడం గమనార్హం. వికేంద్రీకరణలో భాగంగా విశాఖలో రాజధాని ఏర్పాటుకు ప్రభుత్వం ముందడుగు వేస్తోంది. అయితే గత రెండున్నర నెలలుగా తన సామాజికవర్గ ప్రయోజనాల కోసం అమరావతిలో రైతులతో కృత్రిమ ఆందోళనలు చేయిస్తున్న చంద్రబాబు విశాఖలో రాజధాని ఏర్పాటు కాకుండా ఎల్లోమీడియాతో కలిసి కుట్రలు పన్నుతున్నాడు. విశాఖలో రాజధాని ఏర్పాటుతో వెనుకబడిన తమ ప్రాంతం డెవలప్ అవుతుందని, తమ జీవితాలు బాగుపడతాయని భావిస్తున్న ఉత్తరాంధ్ర ప్రజలు చంద్రబాబు కుట్రలపై భగ్గుమంటున్నారు.
ఈ నేపథ్యంలో అమరావతికి జై కొడుతూ ఇన్నాళ్లు విశాఖలో అడుగుపెట్టేందుకు ధైర్యం చేయని చంద్రబాబు ఇవాళ పేదలకు ఇండ్ల స్థలాల సేకరణపై రాజకీయం పేరుతో విశాఖ వచ్చాడు. దీంతో ప్రజా సంఘాలు, వివిధ వర్గాల ప్రజలు, మహిళలు, వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుని చంద్రబాబు కాన్వాయ్‌ను అడ్డుకున్నారు. ఉత్తరాంధ్ర ద్రోహి గో బ్యాక్ అంటూ చంద్రబాబును ఎయిర్‌పోర్ట్ నుంచి బయటకు అడుగుపెట్టనివ్వడం లేదు. దీంతో చంద్రబాబు రోడ్డుపై బైఠాయించి పోలీసులపై, ప్రజలపై అసహనం వెళ్లగక్కాడు. ప్రజా ఆందోళనల నేపథ్యంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడడంతో పోలీసులు చంద్రబాబును తిరిగి విజయవాడకో, హైదరాబాద్‌కో తరలించేందుకు ప్రయత్నిస్తున్నారు. మొత్తంగా విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో సేమ్ సీన్ రిపీటైంది. అప్పుడు జగన్ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎయిర్‌పోర్ట్‌లో బైఠాయిస్తే..ఇప్పుడు చంద్రబాబు మాత్రం తన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం బైఠాయించాడు. ఈ సీన్‌పై నెట్‌జన్లు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. ఏ ఎయిర్‌పోర్ట్‌లో అయితే ఆరోజు చంద్రబాబు అధికారంలో ఉన్నామనే అహంకారంతో తనను పోలీసులతో బయటకు రానివ్వకుండా చేసాడో..అదే ఎయిర్‌పోర్ట్‌లో ప్రజలతో వెనక్కి పోయేలా చేసాడు..మా టైమ్ వస్తుంది..గట్టిగా కొడతాం అన్న జగన్ చెప్పిన మాట ప్రకారం చంద్రబాబును దిమ్మతిరిగేలా కొట్టాడు..నిజంగా జగన్ మగాడ్రా బుజ్జీ అంటూ నెట్‌జన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రస్తుతం విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో రిపీటైన సేమ్ సీన్ ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది.