రష్యన్ టెన్నిస్ స్టార్ ఆల్ టైమ గ్రేట్ ప్లేయర్ మారియా షరపోవా టెన్నిస్ కు గుడ్ బై చెప్పేసింది. ఈ స్టార్ ప్లేయర్ ఐదుసార్లు గ్రాండ్ స్లామ్ విజేతగా నిలిచింది. ఈ ప్రపంచ మాజీ నెంబర్ వన్ అంతర్జాతీయ ఆట నుండి తప్పుకుంటున్నానని ప్రకటించింది. దాంతో యావత్ ప్రపంచ టెన్నిస్ అభిమానులు ఒక్కసారిగా నిరుత్సాహానికి లోనయ్యారు. షరపోవా రష్యాలోని సైబీరియాలో ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందినది. ఎంతో కష్టపడి ఆర్ధికంగా స్థిరపడి అన్ని వదిదుడుకులను ఎదుర్కొని ప్రపంచ నెంబర్ వన్ ర్యాంకర్ గా నిలిచింది. అంతేకాకుండా 5 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ ను సాధించి మహిళలు గర్వించే స్థాయికి ఎదిగింది. ఈ 17 ఏళ్ల ప్రాయంలోనే 2004 వింబుల్డన్ టైటిల్ నెగ్గి… ఫ్రెంచ్, ఆస్ట్ర్రేలియన్ టైటిల్స్ నెగ్గడంతో పాటు 21 వారాలపాటు నంబర్ వన్ ర్యాంకులో నిలిచింది.