ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై సోషల్ మీడియాలో ఇటీవల అసభ్యకర పోస్టు చేసిన ఓ వ్యక్తిపై కేసు నమోదైంది. కడప జిల్లా పోలీసుల కథనం ప్రకారం.. మైదుకూరుకు చెందిన పుల్లయ్య, సీఎం జగన్‌ను ఉద్దేశించి అసభ్యకరంగా మాట్లాడుతూ టిక్‌టాక్ చేసినట్టు దువ్వూరు మండలంలోని పెద్దజొన్నవరానికి చెందిన వైసీపీ నేత కానాల జయచంద్రారెడ్డి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని అరెస్ట్ చేసాం.. అని తెలిపారు. అయితే సదరు వ్యక్తి దారుణంగా జగన్ ని, ఆయన తల్లి, భార్యను రాయలేని పదజాలంతో బూతులు తిట్టాడు. ఈ టిక్ టాక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవగా ఎట్టకేలకు అతనిని పట్టుకున్నారు.
