ఏపీలో చంద్రబాబు హయాంలో రాజధాని నిర్మాణానికి అమరావతి రైతులు ఇచ్చిన భూముల్లో కొంత మేర పేదలకు కేటాయించాలని జగన్ సర్కార్ జీవో జారీ చేసింది. అయితే ఈ జీవోను టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుతో పాటు, ఆయన మిత్రుడు జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తాజాగా అమరావతిలో పేదలకు ఇండ్ల పట్టాలపై పవన్ స్పందిస్తూ.. వివాదాలకు తావు లేని భూములనే ఇళ్ల స్థలాలకు కేటాయించాలని డిమాండ్ చేశాడు. ఈ మేరకు జనసేన ఓ ప్రెస్‌నోట్ రిలీజ్ చేసింది. నిర్దేశిత అవసరాల కోసం అంటే రాజధాని కోసం సమీకరించిన భూములను ఇతర అవసరాలకు కేటాయించిన పక్షంలో వివాదాలు రేగుతాయి. ఓ వైపు భూములు ఇచ్చిన రైతులు రాజధాని కోసం ఉద్యమాలు చేస్తుంటే…మరోవైపు ప్రభుత్వం పట్టాలు ఇవ్వాలని ఉత్తర్వులు జారీ చేయడం..ప్రజల మధ్య చిచ్చు పెట్టడమే అంటూ పవన్ రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేశాడు. రాజధాని కోసం ఉద్దేశించిన భూములను లబ్దిదారులకు ఇచ్చి ప్రభుత్వం చేతులు దులుపుకోవాలని చూస్తుందని, తదుపరి వచ్చే చట్టపరమైన చిక్కులతో ఇబ్బంది పడేది పేదలే అంటూ పవన్ హెచ్చరించాడు.
ఇదే పవన్ గతంలో చంద్రబాబు హయాంలో రాజధానిలో పేదలు ఇల్లు కట్టుకునే పరిస్థితి ఉందా అని ప్రశ్నించిన పవన్..ఇప్పుడు జగన్ సర్కార్ పేదల ఇళ్ల పట్టాలు ఇచ్చి..వారి సొంతింటి కలను నెరవేర్చేందుకు ప్రయత్నిస్తే స్వాగతించేది పోయి వ్యతిరేకించడం చూస్తుంటే..పవన్ ఇన్నాళ్లు పేదలపై ప్రదర్శిస్తున్నదంతా కపట ప్రేమ, నటన అని అర్థమవుతుంది. గతంలో ఇదే పవన్ చంద్రబాబు హయాంలో ఎలా మాట్లాడాడో చూడండి.. ” అమరావతికి నేను ఒక పార్వతీపట్నం నుంచో లేదంటే ఆముదాలవలస నుంచో వెళ్తాను. నేనొక సామాన్యున్ని. అమరావతిలో నాకు స్థలం కావాలంలే ఎలా? గవర్నమెంట్ 33 వేల ఎకరాలో, లక్ష ఎకరాలో పెట్టుకొంది. ఎట్లా ఇస్తారు మీరు. నేను ఇక్కడ ఉండాలి, పనిచేస్తాను. నాకు కనీసం ఇల్లు కట్టుకునే అవసరం ఉంటుంది కదా. ఉత్తరాంధ్ర నుంచి ఇక్కడికి వచ్చి ఎలా స్థిరపడతారు? రాయలసీమ ప్రాంతవాసులు ఇక్కడ ఎలా స్థిరపడతారంటూ నిలదీశాడు. చూశారా పవన్‌లోని ద్వంద వైఖరి. గతంలో అమరావతిలో నాకు స్థలం కావాలంటే ఎలా? అని ప్రశ్నించిన పవన్…ఇప్పుడేమో జగన్ ప్రభుత్వం అదే అమరావతిలో పేదలకు పిలిచి మరీ ఇంటి స్థలం ఇస్తుంటే, ఎలా ఇస్తారని నిలదీస్తున్నాడు.పేదలకు మంచి జరగడం కంటే చంద్రబాబు ప్రయోజనాలే తనకు ముఖ్యమని పవన్ చెప్పకనే చెప్పాడు. మొత్తంగా పేదల ఇండ్ల స్థలాల విషయంలో పవన్ తన రెండు నాల్కల ధోరణిని తనకు తానే బయటపెట్టుకున్నాడు. పేదల ఇండ్ల స్థలాల విషయంలో చంద్రబాబు హయాంలో ఒకలా..జగన్ హయాంలో మరొకలా మాట్లాడడంతో ప్యాకేజీ స్టార్ అనిపించుకున్నారని నెట్‌జన్లు సెటైర్లు వేస్తున్నారు.