Home / SLIDER / రోజూ నల్లా నీళ్లు వస్తున్నాయా?

రోజూ నల్లా నీళ్లు వస్తున్నాయా?

తెలంగాణ రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు పట్టణ ప్రగతిలో భాగంగా జనగాం జిల్లా కేంద్రంలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా మంత్రి కేటీఆర్ జనగామ,భువనగిరి పట్టణ ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్నారు.

జనగామ జిల్లా కేంద్రంలోని పదమూడవ వార్డులో మంత్రి కేటీఆర్ పర్యటిస్తూ స్థానికులను వారు ఎదుర్కుంటున్న పలు సమస్యలపై అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా జనగామ మున్సిపాలిటీ 13వ వార్డులో పాదయాత్రలో భాగంగా మంత్రి కేటీఆర్‌.. హైమవతి అనే గృహిణి మధ్య జరిగిన
సంభాషణ ఇదీ..

కేటీఆర్‌: రోజూ నల్లా నీళ్లు వస్తున్నాయా?
గృహిణి : వస్తున్నయి సార్‌

కేటీఆర్: మిషన్‌ భగీరథ నల్లా పెట్టిండ్లా?
గృహిణి: పాత నల్లాతో రోజు నీళ్లు వస్తున్నయ్‌..

కేటీఆర్:చెత్తబండి వస్తున్నదా?
గృహిణి: రోజు వస్తున్నది సార్‌

కేటీఆర్:చెత్త బుట్టలు ఉన్నయా?
గృహిణి: ఉన్నయ్‌

కేటీఆర్:రిక్షాకు చెత్త ఎట్ల ఇస్తున్నవ్‌.. నీకు టెస్ట్‌ పెడుతున్న.. ఏవీ మీ ఇంట్లో రెండు బుట్టలు ఉన్నయా? చూపిస్త్తవా? తీసుకురా పో..

గృహిణి: సార్‌ మాది ఈ ఇల్లు కాదు.. ఎదురిల్లు

కేటీఆర్:మీ ఇంట్లో వాడుతున్నవా? లేదా?
గృహిణి: ఒకటే ఉన్నది సార్‌..

ఇంకోటి ఏమైంది?
గృహిణి: అప్పుడిచ్చిండ్లు.. ఇప్పుడు ఇవ్వలేదు సార్‌

కేటీఆర్: నెలకోటి ఇస్త్తరా ఏందీ? ఆ డబ్బాల్లో పప్పులు పోసిండ్లా?
గృహిణి: అవును సార్‌

కేటీఆర్:అందుకే అడుగుతున్న తెల్వక అడుగుతున్న అనుకున్నవా?
గృహిణి: హా అవును సార్‌ నిజమే

(అధికారులతో)మళ్లీ ఒక రౌండ్‌ కొత్తగా ఇవ్వండి.. హైమా ఈసారి వాడకపోతే ఫైన్‌ వేస్తం

గృహిణి: కొత్తవి ఇవ్వండి సార్‌

కేటీఆర్:పప్పులు, బియ్యాలు పొయ్యద్దు మరి

గృహిణి: పప్పులు, బియ్యం కాదు.. తడి, పొడి చెత్త వేస్తాం

కేటీఆర్:ఉల్టా నాకే చెప్తున్నవా? (నవ్వులు).. నేను ఇంతసేపు క్లాస్‌ పీకితే, నువ్వు ఉల్టా నాకే చెప్తావ్‌.. బాగున్నవ్‌ తల్లీ..

గృహిణి: మీక్కూడా క్లారిటీ ఇవ్వడం కోసం చెప్తున్నం సార్‌

కేటీఆర్:ఏం చదువుకున్నవ్‌.. జీవితం చదివినవా?
గృహిణి: ఇంటర్‌ సార్‌

కేటీఆర్:జీవితం చదివేసినవ్‌ అర్థమైంది.. కానీ బుట్టలు ఇస్తాం.. సిబ్బందిని పెంచుతం కాని దయచేసి వాడండి..(నవ్వుతూ..)

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat