ఏపీలో 42 గ్రామ న్యాయాలయాల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రతి గ్రామ న్యాయాలయంలోనూ గ్రామ న్యాయాధికారిగా జూనియర్ సివిల్ జడ్జిని నియమించనున్నారు. అలాగే ప్రతిచోటా న్యాయాధికారితో పాటుగా మరో నలుగురు సిబ్బందిని నియమిస్తారట. గుంటూరు జిల్లాలో అత్యధికంగా 12 గ్రామ న్యాయాలయాలు ఏర్పాటు చేయనున్నారు. ప్రకాశం – 8, అనంతపురం – 2, చిత్తూరు – 1, తూర్పుగోదావరి -1, కృష్ణ – 2, కర్నూల్ – 3, నెల్లూరు – 3, శ్రీకాకుళం – 3, విశాఖపట్నం – 2, విజయనగరం – 1, పశ్చిమ గోదావరి – 2, కడప – 2 చొప్పున న్యాయాలయాలు ఏర్పాటుకానున్నాయి.
