పాపం చంద్రబాబు ఈ వయస్సులోని కూడా ఎంత కష్టపడుతున్నారో. ఏవేవో ప్రయత్నాలు చేస్తున్నారు గాని చివరి ఫలితం మాత్రం శూన్యమని చెప్పాలి. చంద్రబాబు కష్టపడడం అంటే ప్రజలకోసం అనుకున్నారేమో ముమ్మాటికీ కాదు కేవలం తన సొంత ప్రయోజనాలు కోసమే ఇదంతా అని చెప్పాలి. మొన్న జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు చాలా ఘోరాతి ఘోరంగా ఓడిపోయిన విషయం అందరికి తెలిసిందే. 2014 ఎన్నికల్లో తప్పుడు హామీలతో ప్రజలను మోసం చేసి గెలిచిన తరువాత ఈ రాష్ట్రం నాకు సంబంధం లేదు నా కుటుంబం నావాళ్ళు అన్నట్టుగా ప్రవత్తించారు. బాబు హయంలో రైతులు ఆత్మహత్యలకు కూడా పాల్పడ్డారు. ఇన్ని జరుతున్నా చంద్రబాబు మాత్రం కనీసం పట్టించుకోలేదు. ఏం చేసుకుంటారో చేసుకోండి అన్నట్టుగా ప్రజలని గాలికి వదిలేయడమే కాకుండా ఇదెక్కడి న్యాయం అని అడిగిన వారిని పోలీసులతో కొట్టించారు. దాంతో విసిగిపోయిన ప్రజలు బాబుకి ఎలాగైనా బుద్ధి చెప్పాలని నిర్ణయించుకొని జగన్ ని గెలిపించారు. దారుణంగా ఓడిపోవడంతో ఇప్పుడు చంద్రబాబు పరిస్థితి ఇంకా గొప్పగా తయారయ్యింది. ఎంత దారుణం అంటే ఆయన వైసీపీ నిందలు వెయ్యాలని ప్రయత్నం చేసినప్పుడల్లా అది ఆయనకే తిప్పి కొడుతుంది. దీనిపై స్పందించిన ఎంపీ విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా చంద్రబాబు పై కామెంట్స్ చేసారు.”కొండపై నుంచి జారిపడుతూ మధ్యలో కొమ్మను పట్టుకుని వేలాడుతున్న పరిస్థితి చంద్రబాబుది. ఏ క్షణంలోనైనా కొమ్మ విరగొచ్చు లేదా పట్టుతప్పి తనే అగాథంలోకి పడిపోవచ్చు. అంత నిస్సహాయతలో కూడా ‘ఒక్కొక్కరి భరతం పడతా, ఎవర్నీ వదిలి పెట్టేది లేదు’ అని బెదిరిస్తున్నాడంటే మామూలు ‘గుండె’ కాదు” అని అన్నారు!
