తెలంగాణ రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు పట్టణ ప్రగతిలో భాగంగా జనగాం జిల్లా కేంద్రంలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా మంత్రి కేటీఆర్ జనగామ,భువనగిరి పట్టణ ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్నారు. జనగామ జిల్లా కేంద్రంలోని పదమూడవ వార్డులో మంత్రి కేటీఆర్ పర్యటిస్తూ స్థానికులను వారు ఎదుర్కుంటున్న పలు సమస్యలపై అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ” పట్టణ ప్రగతి కార్యక్రమం ముఖ్యమంత్రి కేసీఆర్ మానసపుత్రిక. పట్టణ ప్రగతి కార్యక్రమంతో మన పట్టణాలను మనమే అభివృద్ధి చేసుకుందాం.. రోడ్లను పరిశుభ్రంగా ఉంచుకుందాం.. వీధి దీపాలను బాగుచేసుకుందాం. పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు.
అందుకే మన వార్డుల్లో ఖాళీ స్థలాలున్న చోట మొక్కలను నాటుకుందాం. నర్సరీలను అభివృద్ధి చేసుకుందాం. ఆన్ లైన్ విధానం ద్వారానే భవన నిర్మాణ అనుమతులు జారీ చేయనున్నాము. భవన
నిర్మాణ అనుమతులకు ఎవరైన లంచం అడిగితే సహించేది లేదు. ఎనబై ఐదు శాతం మొక్కలు దక్కకుంటే పదవులు ఊడటం ఖాయం.. ఏఫ్రిల్ ఒకటో తారీఖు నుండి కొత్త అసరా పెన్షన్లు అందజేస్తాం అని ఆయన అన్నారు.