మహిళా టీ20 ప్రపంచకప్ లో భాగంగా నేడు ఇంగ్లాండ్, థాయిలాండ్ మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో ఇంగ్లాండ్ థాయిలాండ్ పై 98పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. ముందుగా బ్యాట్టింగ్ చేసిన ఇంగ్లాండ్ ఓపెనర్స్ ను సున్నా పరుగులకే వెనక్కి పంపించారు. అనతరం వచ్చిన కెప్టెన్ నైట్, స్సివేర్ అద్భుతంగా రాణించారు. ఈ క్రమంలోనే కెప్టెన్ శతకం చేసి రికార్డు సృష్టించింది. ఈ శతకంతో మూడు ఫార్మాట్లో సెంచరీ సాధించిన మొదటి మహిళా క్రికెటర్ గా చరిత్ర సృష్టించింది.
