ప్రస్తుత రోజుల్లో మెగాస్టార్ చిరంజీవి సినిమా టైటిల్స్ ను తెలుగు, తమిళ హీరోలు గట్టిగా వాడుకుంటున్నారు అనడంలో సందేహమే లేదని చెప్పాలి. దీనికి మంచి ఉదాహరణ కార్తీ నటించిన ‘ఖైదీ’ సినిమానే. ఈ సినిమా బ్లాక్ బ్లాస్టర్ హిట్ కూడా అయ్యింది. ప్రస్తుతం విజయ్ ‘మాస్టర్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇక తెలుగులో నాని ‘గ్యాంగ్ స్టర్’ సినిమా వచ్చింది. ఇక ప్రస్తుతం తమిళ్ సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా అదే బాటలో వెళ్తున్నాడు. ఆయన నటించబోతున్న 168వ చిత్రానికి మెగాస్టార్ టైటిల్ నే పెట్టనున్నారని తెలుస్తుంది. ఈ సినిమాకు అన్నాతే(తెలుగులో అన్నయ్య) అనే టైటిల్ ఫిక్స్ చేసారు. తెలుగులో ఈ టైటిల్ తోనే రిలీజ్ చేస్తే సూపర్ హిట్ అవుతుందని భావిస్తున్నారు.
