అగ్రరాజ్యధిపతి అమెరికా అధ్యక్షుడు భారత్ లో రెండురోజుల పర్యటనలో భాగంగా మంగళవారం నాడు రాష్ట్రపతి భవన్ లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గౌరవార్థం విందు ఏర్పాటు చేసారు. ఆయనతో పాటు భార్య మెలానియా ట్రంప్ కూడా ఉన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ, ఉపాధ్యక్షుడు ఎం. వెంకయ్య నాయుడు కూడా ఇందులో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ను రాష్ట్రపతి శ్రీ రామ్ నాథ్ కోవింద్ ట్రంప్ కు పరిచయం చేశారు. భారతదేశంలో అభివృద్ధి బాగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రానికి ఈయన ముఖ్యమంత్రి అని ఈయన పాలను చూసి పక్క రాష్ట్రాల వారు కూడా అదే ఫాలో అవుతున్నారని చెప్పారు. అనంతరం ట్రంప్ సీఎం కేసీఆర్ తో ముచ్చటించారు. నా కూతురు ఇవాంకా హైదరాబాద్ పర్యటనలో భాగంగా మీరు ప్రత్యేక శ్రద్ధ చూపెట్టారని గుర్తుచేశారు.
