ప్రజా చైతన్య యాత్రలో భాగంగా ప్రకాశం జిల్లాలో పర్యటించిన సందర్భంగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు మద్యం రేట్లపై స్పందిస్తూ జగన్ సర్కార్‌పై తీవ్ర విమర్శలు చేశారు. బాబుగారికి మందు తాగే అలవాటు లేకపోయినా..ఓ ఫుల్ బాటిల్ ఎత్తేసిన వాడిలా మందుబాబుల తరపున వకల్తా పుచ్చుకుని మాట్లాడాడు..తమ్ముళ్లు…మద్యం రేట్లు పెరిగాయా లేదా…పెరిగాయా లేదా..అన్ని బాండ్లు దొరుకుతున్నాయా…ఏదో బలహీనతతో ఓ పెగ్గేసుకునేవాళ్లకు ఈ ఖర్మేంటీ అంటూ ప్రభుత్వంపై చంద్రబాబు విరుచుకుపడ్డాడు. అయితే చంద్రబాబు వ్యాఖ్యలపై టీడీపీ నేతలే అవాక్కయ్యారు. బాధ్యతాయుతమైన ప్రతిపక్ష నాయకుడిగా ఉండి..ఇలా తాగుబోతుల తరపున మాట్లాడుతున్నాడు.. టీడీపీ అధ్యక్షుడా…తాగుబోతుల సంఘం అధ్యక్షుడా..అంటూ నెట్‌జన్లు చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. అయితే తాజాగా చంద్రబాబు మద్యం రేట్లపై చేసిన వ్యాఖ్యలపై ప్రైమ్ 9 టీవీ ఛానల్‌లో డిబెట్ నిర్వహిస్తూ కాలర్ల ఒపీనియన్స్ తీసుకున్నారు. ఈ సందర్భంగా హేమ అనే మహిళ మాట్లాడుతూ చంద్రబాబును ఎలా చీల్చి చెండాడిందో ఆమె మాటల్లోనే వినండి..
సర్…నా పేరు హైమ..నేను గోదావరి జిల్లాల అభిమానిని..అనంతపురం, చిత్తూరు దగ్గర వ్యవసాయం చేసి చంద్రబాబు గారి దగ్గర ఆదర్శరైతు అవార్డు కూడా తీసుకుని..చివరగా హైదరాబాద్‌కు వచ్చి..తెలంగాణలో పొట్ట పోసుకుని గడుపుతున్నాను సర్ ..అయితే నేను ఏ పార్టీకి చెందిన వ్యక్తిని కాను..తటస్థంగా ఉండే వ్యక్తిని..కాకపోతే డిబెట్లో కూర్చున్న నలుగురు రాజకీయ నేతలకు ఒకటి చెప్పదల్చుకున్నా సర్.. దయచేసి స్వార్థ ప్రయోజనాల కోసం..రాజకీయాలు చేసి..రాష్ట్రాన్ని ఇంకా సంకనాకించకండి..ముఖ్యంగా టీడీపీ నేతలకు ఒక్కమాట చెప్పదల్చుకున్నానండీ….నేను తెలుగుదేశం అభిమానినే కాబట్టి చెబుతున్నా మీకు..మందు తాగాలా వద్దా…ఈ పెగ్గేసుకునేవాళ్లకు ఈ ఖర్మేంటీ..ఏంటండీ ప్రశ్నలు..తాగడానికి నీళ్లు లేక చాన్నాళ్ల నుంచి అల్లాడిపోతున్నారు..నేను ఇక్కడకు (నారావారిపల్లెకు) వచ్చి సంక్రాంతి చేసుకుంటాను కాని..పొలాలకు నీళ్లో, తాగడానికి నీళ్లో నేను ఆలోచించలేదు..ఇప్పటికైనా మనం చేసుకోవాలి అనే మాట ఉండదు..మా ఆకలితో సంబంధం ఉండదు..నేను రైతుగా ఐదేళ్లు చచ్చీ చెడి వ్యవసాయం చేసి ఇక్కడ తెలంగాణకు వచ్చి బతుకుతున్నాను..ఇంకో టీడీపీ నేత అంటున్నారు..పక్క రాష్ట్రానికి వెళ్లిపోతున్నాయి మద్యనియంత్రణ వల్ల ఇక్కడ (ఏపీ) డబ్బులన్నీ..9 వేల కోట్లు కాదండి..ఎంత పోయినా ఫర్వాలేదు..కానీ..మందు తాగి చచ్చిపోయే మా పక్కింటోళ్ల కంటే..మాకు ఈ డబ్బులు పోయినా ఫర్వాలేదు బతకనివ్వండి….అసలు మాట్లాడడానికి ఏ సబ్జెక్ట్‌లు లేవా టీడీపీ నేతలకు అంటూ..సదరు కాలర్ హైమ మండిపడ్డారు. మొత్తంగా చిత్తూరు జిల్లాలో తాగడానికి నీళ్లే లేకుంటే పెగ్గేసుకునేవాళ్లకు ఈ ఖర్మేంటీ అంటూ తాగుబోతులను వెనకేసుకు వస్తూ మాట్లాడడానికి చంద్రబాబుకు సిగ్గులేదా..ప్రజల దగ్గరకు వెళ్లి మాట్లాడడానికి టీడీపీ నేతలకు సబ్జెక్టులు లేవా అంటూ సదరు మహిళ ఫైర్ అయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
టీడీపీ నాయకులు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుంటే బాగుంటుంది.
Publiée par Commonman sur Mercredi 26 février 2020