జనసేన అధినేత ,ఒకప్పటి స్టార్ హీరో పవన్ కళ్యాణ్ హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చి.. ఇండస్ట్రీని షేక్ చేసిన చిత్రం బద్రి. ఈ మూవీ తర్వాత ఇరువురు ఇండస్ట్రీలో టాప్ రేంజ్ కు చేరుకున్నారు. చాలా ఏళ్ల తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో మరో చిత్రం రాబోతుందని ఫిల్మ్ నగర్లో వార్తలు వినిపిస్తున్నాయి.
చాలా గ్యాప్ తర్వాత వరుస సినిమాలు చేస్తోన్న పవన్ కళ్యాణ్ తాజాగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.
అయితే ఈ మూవీ హారీష్ శంకర్ సినిమా తర్వాత ఉంటుంది అని ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ చిత్రం దేశభక్తి నేపథ్యంగా సాగనున్నదని ఫిల్మ్ నగర్లో టాక్. ఒకవేళ ఇదే నిజమైతే పవన్ పూరీ కాంబోనేషన్ అన్ని రికార్డులను బద్దలు కొట్టడం ఖాయమంటున్నారు విశ్లేషకులు.