Home / SLIDER / వృద్ధురాలికి మంత్రి కేటీఆర్‌ భరోసా

వృద్ధురాలికి మంత్రి కేటీఆర్‌ భరోసా

దేవరకొండలో జరిగిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్న సంగతి విదితమే. ఇందులో భాగంగారేకుల ఇల్లుతో తాను పడుతున్న ఇబ్బందులను ఏకరువు పెట్టిన ఓ వృద్ధురాలికి ఇంటికి చెత్తు (పై కప్పు) వేయిస్తానని పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ భరోసా ఇచ్చారు.

పట్టణప్రగతిలో భాగంగా దేవరకొండ పట్టణంలోని తొమ్మిదోవార్డులో పర్యటించిన మంత్రికి, నాగమ్మ అనే వృద్ధురాలికి మధ్య జరిగిన సంభాషణ ఇదీ..

కేటీఆర్‌: అవ్వా నీ పేరేమిటి?

వృద్ధురాలు: పానగంటి నాగమ్మ సార్‌

కేటీఆర్‌:పెన్షన్‌ వస్తున్నదా?

వృద్దురాలు: వస్తున్నది సార్‌

కేటీఆర్‌:మిషన్‌ భగీరథ నల్లా వస్తున్నదా ?

వృద్దురాలు: వస్తున్నది సార్‌

కేటీఆర్‌:చెత్త బండి వస్తున్నదా?

వృద్దురాలు: నిత్యం వస్తున్నది

కేటీఆర్‌:చెత్త బుట్టలు ఉన్నాయా?

వృద్దురాలు: లేవు సార్‌

కేటీఆర్‌:పంపిస్తాలే గాని.. ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయా?

వృద్దురాలు: ఒంటరిగా ఉంటున్నా.. రేకుల ఇల్లు కావడంతో వర్షాలకు, ఎండలకు ఇబ్బంది పడుతున్న. దయుంచి చెత్తు పోయించండి సార్‌

కేటీఆర్‌:తప్పకుండా నీ ఇంటికి చెత్తు వేసేందుకు సాయం చేస్తా అని హమీచ్చారు మంత్రి.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat