అగ్రరాజ్యధిపతి అమెరికా అధ్యక్షుడు భారత్ లో రెండురోజుల పర్యటనలో భాగంగా మొదటిరోజు ఇండియాలో అడుగుపెట్టిన అనంతరం మొదటి సబర్మతి ఆశ్రమం తరువాత క్రికెట్ స్టేడియం కు వెళ్ళడం జరిగింది అనంతరం సాయంత్రం తాజ్ మహల్ ను సందర్శించారు. ఇక రెండోరోజు ఢిల్లీలో పర్యటించగా మంగళవారం రాత్రి రాష్ట్రపతి భవన్ లో ట్రంప్ దంపతులకు విందు ఏర్పాటు చేయడం జరిగింది. ఇదంతా పక్కనపెడితే టాలీవుడ్ సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ వీరిద్దరి మధ్యన సంభాషణ అంటూ చమత్కారంగా ట్విట్టర్ లో ఒక పోస్ట్ చేసాడు. ఆ పోస్ట్ ఏమిటంటే..!
ట్రంప్: మిస్టర్ మోడీ నన్ను చూడడానికి 70లక్షల మంది వస్తారు అన్నారు. ఎక్కడ చూస్తే లక్ష కూడా లేరు?
మోదీ: మిస్టర్ ట్రంప్ ఒక డాలర్ విలువ 70రూపాయలు అయినట్టు ఒక గుజరాత్ 70 అమెరికాలతో సమానం!
ఈ విధంగా వర్మ తన ట్విట్టర్ లో పోస్ట్ చేయడం జరిగింది. మరి దీనిపై ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.