మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నన్నిరోజులు చేయని తప్పులు లేవు. అధికారాన్ని అడ్డంపెట్టుకొని ప్రజలను మోసంచేసి తన కుటుంబానికే ప్రయోజనం కలిగేల చేసుకున్నాడు. ఆయన పేరు చెప్పుకొని ఆయన టీమ్ కూడా భారీగానే వెనక వేసుకున్నారు. కాని ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్ పాలన చూసుకుంటే అందుకు పూర్తి బిన్నామని చెప్పాలి. ప్రజల ఆర్తనాదాలు విన్న జగన్ వారికి న్యాయం చేస్తున్నారు. చంద్రబాబు చేసిన అప్పులకు జగన్ ఒక్కొకటిగా దారిలో పెడుతున్నారు. దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందించిన విజయసాయి రెడ్డి “సీఎం జగన్ గారు నాలుగు నెలల్లోనే రివర్స్ టెండర్ విధానంలో రూ.2000 కోట్ల ప్రజా ధనాన్ని ఆదా చేశారు. నువ్వు అధికారంలో ఉంటే 15% ఎక్సెస్ లు, నామినేషన్లతో పనులు కట్టబెట్టి రూ.15 వేల కోట్లు దోచుకునేవాడివి. పరిపాలన అంటే లూటీ చేయడమే అన్న ఫిలాసఫీ కదా నీది. ఎవరేంటో ప్రజలకు తెలిసిపోయింది” అని అన్నారు.
