ఏపీలో గత 9 నెలలుగా జగన్ సర్కార్‌పై ప్రతిపక్ష అధినేత చంద్రబాబుతో సహా టీడీపీ నేతలు, ఎల్లోమీడియా రోజుకో తప్పుడు కథనంతో, అసత్య ఆరోపణలతో దుష్ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గత కొద్దిరోజులుగా సీఎం జగన్ తీరు నచ్చక, వైసీపీ నేతల రాజకీయ వత్తిళ్లు భరించలేక పలువురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కేంద్ర సర్వీసులకు డిప్యుటేషన్‌పై వెళ్లాలని భావిస్తున్నట్లు ఎల్లోమీడియా పచ్చ కథనాలు ప్రసారం చేస్తోంది. అంతేకాదు ఏపీ ప్రభుత్వ సీఎస్ నీలం సహానీ కూడా లాంగ్ లివ్ పెడుతున్నట్లు…మెల్లగా కేంద్ర సర్వీసులకు వెళ్లాలని భావిస్తున్నట్లు బాబుగారి మానసపత్రిక చంద్రజ్యోతి ఓ అబద్ధపు కథనం ప్రచురించింది. దీంతో సీఎస్ నీలం సహానీ ఆ ఫేక్ స్టోరీ ప్రచురించిన సదరు పచ్చ పత్రికపై కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. అయితే తాజాగా మాజీ డీజీ ఆర్‌పీ ఠాకూర్ కూడా కేంద్ర సర్వీసులకు మొగ్గు చూపుతున్నారంటూ ప్రచారం జరుగుతోంది.
ఈ నేపథ్యంలో ఏపీ ఏపీ సివిల్ సర్వీసెస్ అధికారులు డిప్యూటేషన్‌కు దరఖాస్తు చేసుకుంటున్నారని వస్తున్న వార్తలపై కేంద్ర హోంశాఖ స్పందించింది. 2014 నుంచి 2020 వరకు కేవలం 7 మంది ఐపీఎస్ ఆఫీసర్లు మాత్రమే కేంద్ర సర్వీసులకు డిప్యూటేషన్‌పై వచ్చేందుకు మొగ్గు చూపారని స్పష్టం చేసింది. వివరాల్లోకి వెళితే…ఏపీ నుంచి ఎంత మంది సివిల్ సర్వీస్ అధికారులు డిప్యూటేషన్ వైపు మొగ్గు చూపారో చెప్పాలంటూ…ఆర్టీఐ ద్వారా పిటీషన్ దాఖలైంది. ఈ పిటీషన్‌కు కేంద్ర హోం వ్యవహారాల శాఖ చీఫ్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ఏకే సరన్ సమాధానం ఇచ్చారు. 2014 నుంచి విక్రమం సింగ్, పీఎస్ఆర్ ఆంజనేయులు, తుషార్ ఆదిత్య త్రిపాఠీ, వీఎస్‌కే కౌముదీ, ఎస్‌ఏ హుడా, అంజనా సిన్హా, సంతోష్ మెహ్రా వంటి ఏడుగురు అధికారులు మాత్రమే 2014, 2015, 2016, 2017, 2018, 2019 సంవత్సరాలలో ఏపీ నుంచి కేంద్ర సర్వీసులకు వెళ్లేందుకు డిప్యుటేషన్‌కు దరఖాస్తు చేసుకున్నారని కేంద్ర హోం శాఖ ప్రకటించింది.
అలాగే జగన్ సర్కార్ వచ్చాక ఏ ఒక్క సివిల్ సర్వీసెస్ అధికారి కూడా కేంద్ర సర్వీసులకు వెళ్లేందుకుగాను డిప్యుటేషన్‌కు అప్లై చేయలేదని కేంద్ర హోం శాఖ తేల్చి చెప్పింది. మొత్తంగా టీడీపీ హయాంలోనే అమరావతీ ఇన్‌సైడర్ ట్రేడింగ్ బాగోతంలో కాని, పోలవరం, ప్రాజెక్టులలో జరిగిన అవినీతి అక్రమాలలో రాజకీయ ఒత్తిళ్లు భరించలేక, చంద్రబాబు తీరు నచ్చక పలువురు సీనియర్ సివిల్ సర్వీసెస్ అధికారులు కేంద్ర సర్వీసులకు వెళ్లేందుకు డిప్యుటేషన్‌కు అప్లై చేసుకున్నారని కేంద్ర హోం శాఖ చెప్పకనే చెప్పింది. దీంతో గత కొద్ది రోజులుగా జగన్ సర్కార్ తీరు నచ్చక పలువురు సీనియర్ అధికారులు సెంట్రల్ సర్వీసులకు వెళుతున్నట్లు దుష్ప్రచారం చేస్తున్న ఎల్లో గ్యాంగ్ నోర్లు మూతపడ్డట్లైంది. మొత్తానికి గత కొద్దిరోజులుగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కేంద్ర సర్వీసులకు వెళుతున్నట్లు గగ్గోలు పెట్టిన చంద్రబాబుకు, ఎల్లోమీడియాకు కేంద్ర హోంశాఖ దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ వార్త ఏపీ రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది.