హైదరాబాద్ లోని కూకట్ పల్లి సమీపంలో ఉన్న ఇండియన్ డినోనేటర్స్ లిమిటెడ్ కంపెనీలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో శర్మ అనే వ్యక్తి మ్రితి చెందగా మరికొంతమందిని గాయాలు అయ్యాయి. వారిని దగ్గరలో ఉన్న ఆశుపత్రికి తరలించారు. సంఘటన జరిగిన స్థలానికి పోలీసులు, ఫైర్ సిబ్బంది వచ్చి సహాయక చర్యలు చేపట్టారు. ఈ కంపెనీలో తరుచూ ఇలాంటి పేలుళ్లు జరుగుతుండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికి ఇది మూడోసారి సంబవించింది.
