ఏపీ వికేంద్రీకరణలో భాగంగా విశాఖలో పరిపాలనా రాజధానిని ఏర్పాటు చేసేందుకు జగన్ సర్కార్ ముందడుగు వేస్తోంది. దీంతో చంద్రబాబుతో సహా, టీడీపీ నేతలు విశాఖపై విషం కక్కుతున్నారు. విశాఖలో రాజధాని వస్తే సీమ నుంచి లుంగీలు కట్టుకుని భూకబ్జాదారులు, ముఠాకోరులు వచ్చి అరాచకం చేస్తారని సీమ ప్రజలను అవమానిస్తున్నారు. ఇక ఎల్లోమీడియా అయితే రోజుకో అసత్య కథనంతో విశాఖపై దుష్ప్రచారం చేస్తుంది. అయితే టీడీపీ నేతల్లో నోటిదూల ఎక్కువగా నేతల్లో నిమ్మల రామానాయుడు, మహిళా నేత పంచుమర్తి అనురాధ, మాజీ మంత్రి నక్కా ఆనందబాబులు ముందువరుసల్లో ఉంటారు. సీఎం జగన్, వైసీపీ నేతలపై తరచుగా బూతులతో విరుచుకుపడే ఈ ముగ్గురు నేతలు ఉత్తరాంధ్రకు చెందిన నేతలు కాకపోయినా కేవలం చంద్రబాబు మెప్పు కోసం విశాఖపై విషం కక్కారు. రీసెంట్‌గా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిన టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించిన టీడీపీ నేతలు ఈ సందర్భంగా ప్రముఖ ఫార్మా కంపెనీ అరబిందోపై ఆరోపణలు చేయడం వివాదాస్పదంగా మారింది. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తన అల్లుడికి సన్నిహితంగా ఉండే నాటా సభ్యుడు ప్రతాపరెడ్డిని బినామీగా పెట్టుకుని భీమిలిలో 650 ఎకరాలు కొనుగోలు చేశారని. ప్రతాపరెడ్డి ద్వారా రూ.320 కోట్ల విదేశీ పెట్టుబడులు అరబిందో సంస్థకు అనుబంధంగా ఏర్పాటుచేసిన పలు సూట్‌కేసు కంపెనీలకు తరలించారని ఈ ముగ్గురు నేతలు ఇష్టానుసారంగా నోరు పారేసుకున్నారు. అ
యితే తాజాగా టీడీపీ నేతల విమర్శలపై అరబిందో ఫార్మాలిమిటెడ్ సంస్థ మండిపడింది. అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా పరిపాలనా రాజధానిని విశాఖపట్నంలో ఏర్పాటుచేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే, అందుకు తమ కంపెనీకి దురుద్దేశాలు అంటగడుతూ చేసిన ఆరోపణలకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని అరబిందో ఫార్మా లిమిటెడ్ డిమాండ్ చేసింది. తమపై చేసిన నిందారోపణలు దురుద్దేశపూరితమని, ఇవి తమ కంపెనీ పరువు ప్రతిష్టకు భంగం కలిగించేవిగా ఉన్నందున క్షమాపణలు చెప్పాలని, లేని పక్షంలో న్యాయపరమైన చర్యలకు సిద్ధంగా ఉండాలని ఆ సంస్థ స్పష్టంచేసింది. ఈ మేరకు టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, మాజీమంత్రి నక్కా ఆనందబాబు, పంచుమర్తి అనురాధలకు అరబిందో సంస్థ లీగల్ నోటీసులు పంపించింది. మొత్తంగా చంద్రబాబు మెప్పు కోసం ఆధారాల్లేకుండా ఇష్టానుసారంగా నోరు పారేసుకున్న ఈ ముగ్గురు నేతలు చిక్కుల్లో పడ్డారు. నిమ్మల, నక్కా, పంచుమర్తిలకు అరబిందో నోటీసులు జారీ చేయడంపై నెట్‌జన్లు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. టీడీపీ నేతల నోటిదురుసుకు చెల్లించక తప్పదు భారీ మూల్యం అంటూ సెటైర్లు వేస్తున్నారు. మరి అరబిందో నోటీసులపై ఈ ముగ్గురు నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.