ఒంగోలు వేదికగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజాచైతన్య యాత్ర ప్రారంభించిన విషయం అందరికి తెలిసిందే. ఈ యాత్రకు అంతగా స్పందన రాకపోవడంతో చంద్రబాబు పిచ్చెక్కి మాట్లాడుతున్నారని ప్రభుత్వ విప్ గడికోటి శ్రీకాంత్ రెడ్డి ఆయనపై ధ్వజమెత్తారు. తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబుది ప్రజాచైతన్య యాత్ర కాదు పచ్చి బూతుల యాత్ర అని అన్నారు. ఆయనకు ఏమీ చేతకాకపోవడంతో ప్రజా ప్రతినిధులపై వాళ్ళ మనుషులతో దాడులు చేయిస్తున్నారని అన్నారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దళితులకు యకరా భూమి కూడా ఇవ్వలేదుగాని ఇప్పుడు అసైన్డ్ భూముల గురించి మాట్లాడుతుంటే సిగ్గు అనిపించడంలేదా అని అన్నారు. మరోపక్క ఆ యాత్రలో భాగంగా మద్యాన్ని ప్రోత్సహించే విధంగా మాట్లాడారని..అప్పట్లో మద్యం నిషేదించాలని రామోజీరావు రాసిన వార్తలు మర్చిపోయారేమో ఇప్పుడు నోరు మెదపడంలేదు అని అన్నారు.
చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో ఒక రైతు పాస్ బుక్ ఇవ్వడానికి లక్ష రూపాయలు అడిగినట్టు ఆ రైతే స్వయంగా చెప్పాడు. ఈ రైతుల మాటల్లోనే తెలుస్తుంది చంద్రబాబు వీరిని ఎంతలా బాదపెట్టారో అని అన్నారు. ఇదంతా పక్కన పెడితే చైతన్య యాత్రలో భాగంగా బాబు తొమ్మిది నెలలపాటు నా గురించి ఎంత తవ్వినా బొచ్చు కూడా దొరకలేదు.. ఇప్పుడు కొత్తగా సిట్ వేశారు. ఐదేళ్లపాటు జరిగిన పనులన్నింటిపైనా విచారణ చేస్తారంట.. వీళ్లెవరూ నన్ను ఏమీ చేయలేరు.. మిమ్మల్ని ఫినిష్ చేసే రోజు వస్తుంది అని మాట్లాడారు. దీనిపై వైసీపీ నేతలు చంద్రబాబు పై మండిపడ్డారు. ఎవరిబాగోతం ఎలాంటిదో తొందర్లోనే బయటకు వస్తుందని, భయం ఉంది కాబట్టే విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని చంద్రబాబుకు గట్టిగా రిప్లై ఇచ్చారు.