తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ నటుడు.. స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ హీరోగా .. మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్ లో సరికొత్త మూవీ తెరకెక్కుతున్న సంగతి విదితమే. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన సింహా,లెజెండ్ చిత్రాలు మంచి ఘనవిజయాన్ని సాధించడమే కాకుండా.. కలెక్షన్ల సునామీని క్రియేట్ చేసింది.
తాజా వీరిద్దరి కాంబినేషన్ పై చిత్ర పరిశ్రమలో సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. అయితే లేటెస్ట్ మూవీలో బాలయ్య సరసన గతంలో డిక్టేటర్ చిత్రంలో అందాలను ఆరబోసిన అంజలి ఇప్పుడు మరోసారి బాలకృష్ణ సరసన నటించే అవకాశాన్ని దక్కించుకుంది అని ఫిల్మ్ నగర్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
ఈ సినిమాలో మరో హీరోయిన్గా శ్రియను తీసుకున్నట్లు సమాచారం.చూడాలి మరి ఈ చిత్రం మరెన్ని రికార్డులను సొంతం చేసుకుంటుందో..!